TDP MLA GORANTLA BUCHAICHOWDARI TWEET HE COMPARE TO RRR SONG WITH JAGAN GOVERNMENT RULING NGS
Natu Natu song: వైసీపీ పాలనపై RRR మూవీ సాంగ్ తో పేరడీ.. వైరల్ గా మారిన ట్వీట్
గోరంట్ల బుచ్చయ్య చౌదరి
RRR Song: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పాలనపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అందులో కొందరు చేసిన కామెంట్ల క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి వైసీపీ పాలనకు-ఆర్ఆర్ఆర్ సాంగుకు లింకు పెట్టారు.. ఎందుకో తెలుసా...
AP Government RRR Song: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) పాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు టీడీపీ నేతలు విమర్శలు ప్రత్యేక చర్చకు దారి తీస్తున్నాయి. హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (MLA Gorantla Buchaichowdari)తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా (RRR MOvie)లోని నాటు నాటు సాంగ్ (Natu n)ను పేరడీ చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారని తెలుగు దేశం పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chowdary) ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం శాడిస్ట్ ప్రభుత్వం ఉందని.. సీఎం బటన్ నొక్కుతారు.. కానీ అకౌంట్లల్లో డబ్బులు మాత్రం పడవన్నారు. డబ్బా కొట్టుకోవడం తప్ప.. రాష్ట్రంలో సంక్షేమం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా RRR సినిమాలో పాటకు వైసీపీ సర్కారు పాలనతో లింకు పెడుతూ.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు వేస్టు.. వేస్టు వేస్టు అంటూ ఎద్దేవా చేశారు. ‘అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్టు.. పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజు ఊగినట్టు.. నోటి బురద మాటలతో గుడివాడలోన ఎగిరినట్టు.. ప్రత్యేక హోదా నీడలోన రాజకీయం చేసినట్టు.. ఎన్నికల హామీలు కొండఎక్కించినట్టు.. నా పాలన సూడు, నా పాలన సూడు, నా పాలన సూడు.. వేస్టు.. వేస్టు.. వేస్టు.. సుద్ద వేస్టు..’ అంటూ బుచ్చయ్య చౌదరి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్టు..
పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజు ఊగినట్టు..నోటి బురద మాటలతో గుడివాడ లోన ఎగిరి నట్టు..ప్రత్యేక హోదా నీడ లో న రాజకీయం చేసినట్టు..ఎన్నికల హామీ లు కొండఎక్కించి నట్టు..నా పాలన సూడు,నా పాలన సూడు,నా పాలన సూడు..
వెస్టు..వేస్టు.. వేస్టు
అక్కడితో ఆగని గోరంట్ల సీఎం జగన్కు చెందిన సాక్షిపైనా సెటైర్లు వేశారు. వేస్టు.. వేస్టు… పిచ్చ వేస్టు.. వేస్టు.. యక్షి న్యూస్ లాగా పిచ్చ వేస్టు.. అంటూ సాక్షిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. చివర్లో ‘జ’నంతో… ’జ’గన్నటక…’జై’లు పక్షి అంటూ పేర్కొన్నారు.
...వేస్టు... వేస్టు.... వేస్టు..సుద్ద వేస్టు...!
వేస్టు.. వేస్టు... వేస్టు..వేస్టు... వేస్టు... వేస్టు.. పిచ్చ వేస్టు..
వేస్టు.. వేస్టు.. వేస్టు...యక్షి న్యూస్ లాగ పిచ్చ వేస్టు..!#JJJ
‘జ’నం తో ...’జ’గన్నటక...’జై’లు పక్షి!#GBC🔥#SatireNextLevel
ప్రస్తుతం గోరంట్ల ట్వీట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.. గతంలో నూ గోరంట్ల జగన్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓటీఎస్ అంటూ ప్రజలను దోపీడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.