TDP MLA EX MINSTER GANTA SRINIVASARAO PLANS WILL WORKOUT HE WANT LEAD A NEW PLATFORM IN ANDHRA PRADESH NGS VSP
TDP MLA: ఆ మాజీ మంత్రి లెక్క తప్పుతోంది.. ఏ ప్రయత్నం ఫలించడం లేదా..? అసలు ఆయన టార్గెట్ ఏంటంటే..?
గంటా శ్రీనివాస్ (ఫైల్)
TDP MLA: ఆయన మాజీ మంత్రి.. గత ఎన్నికల వరకు ఆయన ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పారు.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.. అయినా ఆయన ఉన్నారని ఎవరికీ గుర్తు ఉండడం లేదు. తన ఉనికిని చాటుకునేందుకు ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ ఎదీ వర్కౌట్ కావడం లేదు.. ఈ సారి భారీ స్కెచ్ వేశారు కానీ.. అది ఆయనకు బూస్ట్ ఇవ్వలేదు.. ఎవరాయన.. ఏంటి ఆ స్కెచ్.
TDP MLA Ganta Srinivasa Rao Political Strategy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ది ప్రత్యేక శైలి.. ఈ సారి మినాహా.. ఆయన అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మనిషిగా.. మంత్రిగా ముద్ర వేసుకున్నారు. కేవలం విశాఖ జిల్లా (Visakha District)కు చెందిన నేత అన్న ముద్రకే పరిమితం కాకుండా.. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. అంతేనా.. ఒక్కో ఎన్నికలో ఒక్కో నియోజకవర్గంలో గెలుపొంది కొత్త ట్రెండ్ కు తెరలేపారు. ఓటమే లేని రాజకీయ నేతగా అందరికి ఆదర్శంగా ఉన్నారు.. అందుకే ఆయనను ఏమైనా అనేందుకు పార్టీ అధినేతలు కూడా సైలెంట్ అవుతారు. గెలిచే సత్తా ఉన్న నాయకుడు అంటూ ఆయనను నెత్తిన పెట్టుకునే వారు.. నాలుగుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కేబినెట్లో మంత్రి. ఇవీ గంటా శ్రీనివాసరావు పొలిటికల్ బయోగ్రఫీలో కీలక అంశాలు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచినా.. తాను ఉన్న టీడీపీ అధికారానికి దూరంగా కావడంతో సైలెంట్ అయ్యారు. అలాంటి గంటా శ్రీనివాసరావు పరిస్థితి తారుమారు అవుతోంది.
2019 నుంచి ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు.. ఆయన తన సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ.. కొత్త నియోజకవర్గమే అయినా 2019లో ఎమ్మెల్యేగా నెగ్గారు. అదే ఆయనకు దక్కిన చివరి విజయం.. తరువాత ఆయన అనుకున్నది ఏదీ జరగడం లేదు. సాధారణంగా ఆయన గెలిచిన తరువాత టీడీపీ అధికారంలో ఉంటే ఆ లెక్క వేరుగా ఉండేది.. కానీ టీడీపీ ఘోరంగా ఓడింది. పోనీ వైసీపీ బొటాబొటీ మెజార్టీతో నెగ్గినా ఆయన చక్రం తిప్పి ఉండేవారు.. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అఖండ విజయం సాధించింది. దీంతో వైసీపీకి ఇతర పార్టీ నేతల అవసరం లేకుండా పోయింది.
ఇటు టీడీపీలో ఉండాలా..? వైసీపీలోకి వెళ్లాలా తేల్చుకోలేక డైలామాలో పడ్డారు. తరువాత అధికార పార్టీకి జై కొడదామని ప్రయత్నించినా.. స్థానిక మంత్రి.. రాజ్యసభ ఎంపీ ఇద్దరూ అడ్డుపడుతూ వచ్చారనే ప్రచారం ఉంది. దీంతో ఆయన పార్టీ మార్పు అంశం వాయిదా పడుతూ.. చివరికి విషయం బహిరంగం అవ్వడంతో.. దాదాపు గేట్లు మూసుకుపోయే పరిస్థితి ఎదురైంది...
గంటాను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన ఓ బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తన రాజకీయానికి అనుకూలంగా మలచుకోవాలి అనుకున్నారు. వెంటనే ఎవరూ ఊహించని విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమోదించుకుంటాను అంటూ హడావుడి చేసి అందరి ఫోకస్ తనపై పడేలా చేసుకున్నారు. కానీ అది కూడా మూడే నాళ్ల ముచ్చటే అయ్యింది.
మధ్యలో గంటా వైసీపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది. తర్వాత బీజేపీవైపు చూస్తున్నారని.. జనసేనలో చేరతారని అనేక ఊహాగానాలు వినిపించాయి. గంటా ఎనాడూ తన రాజకీయ భవిష్యత్‌పై పల్లెత్తు మాట మాట్లాడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కొన్నిరోజులు చర్చల్లో నలిగారు. ఒకానొక దశలో క్రియాశీలక రాజకీయాల నుంచి గంటా తప్పుకొంటున్నారనే ప్రచారం జరిగింది. అటువంటి మాజీ మంత్రి ఇప్పుడు కొత్త సమీకరణాలతో స్క్రీన్‌పైకి వస్తున్నారు.
ప్రస్తుతం ఆయన భారీ స్కెచ్ వేశారు.. ఇప్పటి వరకు ప్రభావం చూపించలేదు కానీ.. తాజా ఆస్త్రంలో ఆయన భవిష్యత్తుపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. తన పాతికేళ్ల రాజకీయంలో ఏనాడూ కులం ప్రస్తావన తీసుకురాని గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు తన సామాజికవర్గం బలం.. బలంగంపై ఫోకస్ పెట్టారు. ప్రతి ఎన్నికలకు నియోజకవర్గాన్ని మార్చేస్తారు. కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే చొడవరం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు గంటా. తర్వాత కాపు సామాజికవర్గం ఆధిపత్యం ఉండే అనకాపల్లిలో పీఆర్పీ నుంచి గెలిచారు. ఆ తర్వాత భీమిలి. ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే. ఈ రెండు చోట్లా కాపుల ఓటింగ్ ఉన్నప్పటికీ బీసీలు.. ఇతర సామాజికవర్గాల ప్రాధాన్యం ఎక్కువ. గెలుపుకోసం అనుకూలమైన నియోజకవర్గాలను ఎంచుకున్నారే తప్ప.. ఏనాడూ కులంపై ఆధారపడి రాజకీయాలు చేయలేదు. కానీ ఇప్పుడు రూటు మార్చారు.
వాస్తవానికి కాపు సామాజికవర్గం గంటాను తమ కుల నాయకుడిగా చూస్తుందే తప్ప ఆయన ఎప్పుడూ ఆ సామాజికవర్గం కోసం పాటుపడింది లేదన్నది రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుందది. దీనికి కుటుంబ, రాజకీయ, వ్యాపారాలు కారణమన్నది ఓపెన్ టాక్. గంటా బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు విస్తృతం. గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం తప్ప ఆయన కాపు బ్రాండ్‌ను ఎప్పుడూ మీద వేసుకోలేదు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కిర్లంపూడి వేదికగా కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉవ్వెత్తున జరిగినప్పుడు గంటా మంత్రిగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆ సామాజికవర్గం ఆందోళన చెందినప్పుడు కూడా గంటా స్పందించలేదని చెబుతారు. తునిలో బహిరంగసభ ద్వారా తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కాపులు ప్రయత్నించారు. ఆ సమయంలోనూ లోపాయికారీ మద్దతివ్వడానికి సైతం గంటా వెనకాడారని అపవాదు మోశారు. కాపుల ఆకలి కేకలు వంటి నినాదాలతో ఆ సామాజికవర్గం గంటా ఇంటిని ముట్టడించిన పరిస్థితులు ఉన్నాయి.
అలాంటి గంటా ఇప్పుడు కాపు కార్డుతో రాజకీయాలు చేస్తున్నారు.. ఆయన ముందు ఉండి సామాజిక వర్గ నేతలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల విశాఖలో ఓ సభలో మాట్లాడిన ఆయన.. భవిష్యత్తులో కాపులదే రాజ్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు కూడా మారుతున్నాయి. కాపులు తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే ఫీలింగ్ లో ఉన్నారు. అందరం ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీలన్నీ కాపు నేతలను తమవైపు తిప్పుకుంటే ముప్పు ఉండదని భావిస్తున్నారు.. కొందరు పవన్ ను కాపు నేతగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు.. మరోవైపు గంటా కూడా జనసేనలో చేరి కాపు సమాజిక వర్గం అండ తీసుకోవడంతో పాటు.. టీడీపీతో పొత్తు ఉంటే.. తన రాజకీయ మనుగడకు తిరుగే ఉండదని లెక్కలు వేసుకుంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. మరి ఈ స్కెచ్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.