Home /News /andhra-pradesh /

TDP MAINTAINING SILENCE ON VIJAYAWADA NAMED AFTER NTR DISTRICT HERE ARE THE REASONS BEHIND PRN

TDP on NTR District: ఎన్టీఆర్ జిల్లాపై స్పందించని టీడీపీ.. కారణం ఇదేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో కొత్త జిల్లాల (AP New Districts) కు సంబంధించి కీలక అంశంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) మాత్రం స్పందించడం లేదు. పార్టీ అధినేత నుంచి కార్యకర్తల వరకు ఈ విషయంలో సైలెంట్ గానే ఉన్నారు.

    ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాలకు (AP New Districts) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..! ధీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నెలరోజుల సమయం ఇచ్చింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చెందిన వారు జిల్లాపేర్లు, జిల్లా కేంద్రాలు, ఇతర అంశాలపై స్పందిస్తున్నారు. కానీ ఓ కీలక అంశంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం స్పందించడం లేదు. పార్టీ అధినేత నుంచి కార్యకర్తల వరకు దీనిపై సైలెంట్ గానే ఉన్నారు. అదే ఎన్టీఆర్ జిల్లా. టీడీపీ (TDP) వ్యవస్థాప అధ్యక్షుడు ఎన్టీ రామారావు (NT Ramarao) పేరును కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విజయవాడ (Vijayawada) జిల్లాకు పెట్టింది ప్రభుత్వం. కానీ టీడీపీ మాత్రం దీనిపై మౌనంగానే ఉంది. కనీసం షోషల్ మీడియాలో కూడా ఆ పార్టీ నేతలు స్పందించలేదు.

    కారణం ఇదేనా..?
    ఎన్టీఆర్ జిల్లాకు మద్దతుగా మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా పొలిటికల్ మైలేజ్ డ్యామేజ్ అవుతుందని టీడీపీ భావిస్తున్నట్లు చర్చ జరగుతోంది. అందుకే అటు చంద్రబాబుగానీ, ఇటు నారా లోకేష్ గానీ, పార్టీ తరపున గానీ కనీసం ట్వీట్ కూడా చేయలేదు. పార్టీ నేతలు కూడా వ్యక్తిగతంగా దీనిపై స్పందించలేదు. ఈ వ్యవహారాన్ని వదిలేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయా..? లేక చంద్రబాబు, లోకేషే స్పందించలేదు.. ఇక మనకెందుకని తమ్ముళ్లే మౌనంగా ఉండిపోయారా..? అనేది చర్చనీయాంశమైంది.

    ఇది చదవండి: ఎన్టీఆర్ జిల్లాపై ఆసక్తికర చర్చ.. తెరపైకి వంగవీటి రంగా పేరు..


    ఎన్టీఆర్ జిల్లాపై నందమూరి కుటుంబం కూడా స్పందించలేదు. ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం ఎన్టీఆర్ జిల్లాను స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అటు ఎమ్మెల్యే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా స్పందించలేదు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా దీనిపై స్పందన కరువైంది. టీడీపీ చేపట్టే ఏ కార్యక్రమమైనా ఎన్టీఆర్ పేరు తలవకుండా, ఆయన విగ్రహానికి పూలమాల వేయకుండా ప్రారంభమవదు. అలాంటి ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు స్పందించలేదనేది ప్రశ్నార్ధకంగా మారింది.

    ఇది చదవండి: ఏపీలోని ఆ కొత్త జిల్లాపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమైన వైసీపీ నేత..


    విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉంది. అంటే కొత్తగా ఏర్పడబోయే కృష్ణా జిల్లాలో ఉంటుంది. అలాంటిది ఎన్టీఆర్ పేరును విజయవాడకు పెట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా ఓట్ల కోసమేనన్న అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడకు దివంగత వంగవీట రంగా పేరు పెట్టాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP new districts, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు