హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నారా భువనేశ్వరిపై వైసీపీ దారుణ కామెంట్లు.. తల్లి బసవతారకం స్వగ్రామంలో నేడు మహాధర్నా

నారా భువనేశ్వరిపై వైసీపీ దారుణ కామెంట్లు.. తల్లి బసవతారకం స్వగ్రామంలో నేడు మహాధర్నా

భువనేశ్వరి, చంద్రబాబు

భువనేశ్వరి, చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలపై టీడీపీ శ్రేణులు ఆదివారం కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యాల్ని ఖండిస్తూ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్వగ్రామం కృష్ణా జిల్లా కొమరవోలులో టీడీపీ ఆదివారం మహాధర్నా నిర్వహించనున్నంది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) లో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)పై అధికార వైసీపీ ఎమ్మెల్యేల దారుణ వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ శ్రేణులు ఆదివారం కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు. అసెంబ్లీలో శుక్రవారం నాడు వ్యవసాయ రంగంపై చర్చ దారి తప్పి, వ్యక్తిగత దూషణలు చోటుచేసుకోవడం, బాబాయి..గొడ్డలి అంటూ వివేకా హత్యను సీఎం జగన్ కు ఆపాదిస్తూ టీడీపీ నేతలు నినాదాలు చేయగా, దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి మరణం గురించి నిజాలు బయటపడాలని, నారా లోకేశ్ ఎలా పుట్టాడో తేలాలని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. వీటిని స్పీకర్ అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించినా, తన భార్యకు అవమానం జరిగిందంటూ చంద్రబాబు(Chandrababu) సభ నుంచి బయటికి రావడం, మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేయడం తెలిసిందే. అసెంబ్లీలో వైసీపీ తీరును ఖండిస్తూ పలువురు ప్రముఖులు స్టేట్మెంట్లు ఇవ్వగా, టీడీపీ నిరసనలను కొనసాగిస్తున్నది..

ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యాల్ని ఖండిస్తూ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్వగ్రామం కృష్ణా జిల్లా కొమరవోలులో టీడీపీ ఆదివారం మహాధర్నా నిర్వహించనున్నంది. మధ్యాహ్నం 2 గంటలకు ధర్నా ఉంటుందని టీడీపీ గ్రామ కమిటీ సెక్రటరీ కొట్లూరు రాజారావు, పామర్రు మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకరాల హరిబాబు తెలిపారు. వేలాదిగా కార్యకర్తలు హాజరై ధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

భువనేశ్వరికి అవమానం తట్టుకోలేక -చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ -శపథం నెరవేరుతుంది!


కొమరవోలు గ్రామాన్ని భువనేశ్వరి 2015లో దత్తత తీసుకున్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టారు. ప్రతి ఇంటికి తాగునీరు, గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు భువనేశ్వరి చర్యలు తీసుకున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు పలు అభివృద్ది పనుల్ని చేపట్టారు. భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను నందమూరి కుటుంబీకులు సైతం ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్లను ప్రస్తావిస్తూ నందమూరి కుటుంబం వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు,

భువనేశ్వరి బాధ, చంద్రబాబు ఏడుపు.. నారా లోకేశ్ మౌనం! -సీఎం జగన్‌పై టీడీపీ నేత తాజా విమర్శలు


నారా భువనేశ్వరి ఉదంతంలో నిరసనలు కొనసాగుతున్నా, ఏపీలో వరద పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ చీఫ్ చంద్రబాబు ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రతిపాటి పుల్లారావు, పరసా రత్నం, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లను కోఆర్డినేటర్లుగా నియమించారు.

Published by:Madhu Kota
First published:

Tags: Chandrababu Naidu, Krishna District, Nara Bhuvaneshwari, TDP

ఉత్తమ కథలు