Home /News /andhra-pradesh /

TDP LEADERS SENSATIONA COMMENTS ON MINISTER KODALI NANI PAST POLITICAL CAREER FULL DETAILS HERE PRN

Kodali Nani: “కొడాలి నానిని లాకప్ లో వేసిన కుమ్మిన టీడీపీ నేత”.. మాజీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్..

కొడాలి నాని (ఫైల్)

కొడాలి నాని (ఫైల్)

గుడివాడ క్యాసినో అంశం (Gudivada Casina Issue) పై వైసీపీ (YSRCP) ప్రభుత్వాన్ని, గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) ని ప్రతిపక్ష టీడీపీ (TDP) టార్గెట్ చేయగా.. అధికార పార్టీ కూడా ఎక్కడా తగ్గకుంటా కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తోంది.

ఇంకా చదవండి ...
    సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) లో నిర్వహించిన క్యాసినో వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. క్యాసినో అంశంపై వైసీపీ (YSRCP) ప్రభుత్వాన్ని, గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) ని ప్రతిపక్ష టీడీపీ (TDP) టార్గెట్ చేయగా.. అధికార పార్టీ కూడా ఎక్కడా తగ్గకుంటా కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తోంది. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడ వెళ్లడం.. అక్కడ వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడం వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుద్ధా వెంకన్న.. మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని హెచ్చరిస్తూనే.. ఆయన గతం గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అంతేకాదు కొడాలి నాని భాష కౌంటర్ అంటూ పరుష పదజాలంతో మండిపడ్డారు.

    సోమవారం విజయవాడ లో మాట్లాడిన బుద్ధా వెంకన్న.. కొడాలి నాని రేంజ్ లోనే రెచ్చిపోయారు. ప్రస్తుత టీడీపీ నేత వర్ల రామయ్య పోలీస్ గా ఉన్నప్పుడు.. లారీల్లో పెట్రోల్ చోరీ చేసిన కేసులో లాకప్ లో వేసి కుమ్మారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లారీల దొంగతనంతో ఈస్థాయికి వచ్చారన్నారు. ఇలాగే కొడాలి నాని పొలిటికల్ కెరీర్ పైనా బుద్ధా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో నానికి టికెట్ ఇచ్చింది చంద్రబాబేనని.. తెలుగు యువత అధ్యక్షుడి పదవి ఇచ్చింది కూడా ఆయనేనని.. ఇందులో హరికృష్ణ పాత్ర లేదని.. దీనిపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని బుద్ధా హెచ్చరించారు.

    ఇది చదవండి: గుడివాడ క్యాసినోపై కొనసాగుతున్న రచ్చ.. కొడాలిపై బుద్ధా వెంకన్న తీవ్రవ్యాఖ్యలు..


    అంతేకాదు కొడాలి నాని.. చంద్రబాబు ఇంటికి వస్తే గేటు దగ్గరే చంపేసి శవాన్ని తిరిగి పంపిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. గుడివాడ క్యాసినో వ్యవారంలో రూ.200 నుంచి 300 కోట్లు చేతులుమారాయన్నారు. ఆడు.. ఈడు అని మాట్లాడటానికి మేమేమైనా మీ బావమరుదులు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు గుడివాడ వస్తే వారిపై రాళ్లు వేయించిన కొడాలి నాని.. బలహీన వర్గాలంటే చిన్నచూపన్నారు.

    ఇది చదవండి: కరోనా సమయంలో జగన్ సర్కార్ కు షాక్..? సమ్మెలోకి కీలక శాఖ ఉద్యోగులు..?


    టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా కూడా కొడాలి నానిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి పిచ్చిపట్టిందని.. ఆయన్ను డాక్టర్ కు చూపించాల్సిన అవసరముందన్నారు. అంతేకాదు మనిషి కనిపిస్తే కొరికేసేలా ఉన్నారని.. రాత్రిపూట వస్తే చేతబడులు చేసేవాడిలా ఉంటారంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే క్యాసినో వ్యవహారంపై ఇప్పటికే కృష్ణాజిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.. డీజీపీకి కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు గౌతమ్ సవాంగ్ అపాయింట్ మెంట్ కోరారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    మీ నగరం నుండి (​విజయవాడ)

    ఆంధ్రప్రదేశ్
    ​విజయవాడ
    ఆంధ్రప్రదేశ్
    ​విజయవాడ
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Buddha venkanna, Gudivada, Kodali Nani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు