Home /News /andhra-pradesh /

TDP LEADERS NARA LOKESH READY TO GO ALL DISTRICT AFTER MAHANADU THESE IS THE 2024 ELECTIONS PLAN NGS

Nara Lokesh: జూన్ నుంచి ప్ర‌జా క్షేత్రంలోకి.. మహానాడు తర్వాత నేరుగా రంగంలోకి లోకేష్.. 2024 వ్యూహం ఇదే

సినిమా చూపిస్తాను అన్న నారా లోకేష్

సినిమా చూపిస్తాను అన్న నారా లోకేష్

Nara Lokesh: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. ఇటు చంద్రబాబు ఇప్పటికే జిల్లాల పర్యాటన ప్రారంభమైందది.. ఇక చినబాబు లోకేష్ కూడా ప్రజా క్షేత్రంలోకి దిగుతున్నారు.. నేరుగా ఇంటింటికీ వెళ్లి అందర్నీ కలిసే అవకాశం ఉంది. మహానాడు అయిన వెంటనే ఆయన రంగంలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
    Nara Lokesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ (Election Heat) మొదలైంది. అన్ని పార్టీల్లో 2024 ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్నాయి. నేరుగా ప్రజల్లోనూ ఉండేలా అడుగులు వేస్తన్నాయి. గడపగడపకూ వైసీపీ (YCP) పేరుతో అధికార పార్టీ ముందుకు వెళ్లనుంది. జనసేన (Janasena) ఇప్పటికే రైతు భరోసా పేరుతో నేరుగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జిల్లాల టూర్ ను ప్రారంభించారు. ఇలా అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుండే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మరో రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుండే పర్యటనల బాట పడుతున్నారు ప్రధాన పార్టీల నాయకులు. ఇక టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  (Nara Lokesh) రంగంలోకి దిగుతున్నారు. ప్రభుత్వ హయాంలో బాదుడే బాదుడు అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేయనున్నారు. ఇదే సమయంలో ఈ నెల నుండి నారా లోకేష్ (Nara Lokesh) కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.

    రానున్న ఎన్నికలే టార్గెట్ గా రంగంలోకి దిగుతున్నలోకేష్.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అయితే టీడీపీలో చంద్రబాబు తర్వాత ప్రత్యామ్నాయం నారా లోకేష్ అని చూపించే ప్రయత్నం మొదటి నుంచి చంద్రబాబు చేస్తున్నా.. ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. అందుకు కారణం మొదటి నుండి నారా లోకేష్ సమర్ధత మీద కేడర్ కు కానీ.. నాయకులకు గాని పూర్తి నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో ఆ అపవాదు పోగెట్టే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధినేత. అందుకే రెండేళ్ల ముందు నుంచే లోకేష్, ప్రజాక్షేత్రంలో తన ముద్ర వేయడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

    ఇదీ చదవండి : మంత్రి రోజా భర్త సంచలన వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లు వద్దని సూచన

    ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గంతో పాటు జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్న లోకేష్.. మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28 తేదీలలో ఒంగోలులో టిడిపి మహానాడు జరగనుంది.

    ఇదీ చదవండి: సిక్స్ కొట్టి.. విల్లు ఎక్కి పెట్టి.. నా ఆట చూడు అంటున్న మంత్రి రోజా..

    దాదాపు లక్షమందికి పైగా పార్టీ శ్రేణులు హాజరయ్యే విధంగా చంద్రబాబు ప్లాన్ చేశారు. మహానాడు తరువాత రానున్న ఎన్నికలను సవాల్ గా తీసుకున్న లోకేష్ ప్రజాక్షేత్రంలో ఉండటంకోసం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం ఉంది. జూన్ నెలలో లోకేష్ పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రాజెక్ట్ ల సందర్శన.. వైసీపీ పాలనా వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా చేయడం లోకేష్ పర్యటన ముఖ్య లక్ష్యం. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టాలని ప్రయత్నాలు సాగిస్తానని చెబుతున్న లోకేష్ ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు