TDP Vs Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ భయపడుతున్నారా...? వైసీపీ కి సపోర్ట్ గా వ్యవహరిస్తున్నారా..? ఇప్పటికి మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్ అనుచరులేనా..? రాజకీయాల్లో ఎన్టీఆర్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా..? ఎన్టీఆర్ సినిమాలో సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఏంటి.. ? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హాట్ టాపిక్ గా మారారు. టీడీపీ నేతలే ఇలాంటి అనుమానాలను తెరపైకి తెస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు (Nara Chandrababu naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara bhuvaneswari)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబానికి భారీగా మద్దతు లభించింది. సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంతా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. సోనూ సూద్, రజనీకాంత్ లాంటి వారు సైతం చంద్రబాబును పరామర్శించారు. ఈ ఘటనపై నందరమూరి ఫ్యామిలీ అంతా భువనేశ్వరికి అండగా నిలిచింది. మరోవైపూ జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. అయితే ఆయన మాట్లాడుతూ.. తాను నందమూరి కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదని.. ఒక కొడుకుగా.. తండ్రిగా.. మాట్లాడుతున్నాను అన్నారు..
ప్రస్తుతం టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం టీడీపీ నేత వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా లాంటి నేతలు జూనియర్ ఎన్టీఆర్ స్పందన ప్రవచనాలు చెప్పినట్టు ఉందని విమర్శించారు. ఆయన మంత్రి కొడాలి నానికి.. వంశీకి సూచనలు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో తమకేం సంబంధం అని ప్రశ్నించారు. ఆయన చెబితే మేం ఎందుకు వింటాం అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు.. అయినా వివాదం అక్కడితో ఆగలేదు. జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదీ చదవండి: నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదు.. అసెంబ్లీ ఘటనపై భువనేశ్వరి రియాక్షన్ ఇదే..
తాజాగా టీడీపీ నేత నిమ్మల రామనాయుడు ఘాటుగా స్పందించారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు భారీ కలక్షన్లు రావడానికి టీడీపీ శ్రేణులే కారణం అన్నారు. ఎన్టీఆర్ అభిమానుల్లో 80 శాతం టీడీపీ వారే ఉన్నారన్నారు. నందమూరి కుటుంబానికి చెందిన ఆయన.. ఇటీవల స్పందించిన తీరు సరైంది కాదన్నారు..
ఇదీ చదవండి: అమ్మా టీ చాలా బాగుంది.. ఓడిపోయిన చోటే నెగ్గాలి అంటున్న లోకేష్
ఎన్టీఆర్ స్పందన చూస్తే.. ఆయన వైసీపీకి భయపడుతున్నారనే అనుమానం కలుగుతోంది అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయనకు సేఫ్ గానీ.. పార్టీకి కాదన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ స్లో మోషన్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారని.. ఆయనతో సంబంధం ఉందా లేదన్నది చెప్పాల్సింది కొడాలి నాని కాదని.. ఎన్టీఆర్ దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు..
సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలను ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. టాలీవుడ్ పెద్దగా భావించే చిరంజీవి సైతం బ్యాలెన్స్ డ్ గా మాట్లాడుతుండడం ఆశ్చర్యమేస్తోందని నిమ్మల రామనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నవారంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే కావడంతో.. టీడీపీ అధిష్టానమే ఈ వ్యాఖ్యలు చేయిస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు మొన్న అసెంబ్లీలో.. తాజాగా వరద ప్రాంతాల పర్యటనల్లోనూ సైతం.. తాను ముఖ్యమంత్రి అయిన తరువాతే సభలోకి అడుగు పెడతానని శపథం చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి కూడా సీఎం అభ్యర్థి చంద్రబాబే అన్నది క్లారిటీ వచ్చేసింది. ఇక లోకేష్ కు భవిష్యత్తు ఉండాలి అంటే.. జూనియర్ ను దూరం పెట్టాలి అన్నదే టీడీపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Jr ntr, Nara Lokesh, TDP