Home /News /andhra-pradesh /

TDP LEADER VARLA RAMAIAH SAYS THAT THE YCP GOVERNMENT HAS CONSPIRED AGAINST DR SUDHAKAR BN

అమెరికా జార్జ్ ఫ్లాయిడ్ లాంటిదే.. డాక్టర్ సుధాకర్ ఘటన.. టీడీపీ నేత వ్యాఖలు

వర్ల రామయ్య, టీడీపీ నేత

వర్ల రామయ్య, టీడీపీ నేత

దళిత సంఘాటు, టీడీపీ దళిత విభాగం, సుధాకర్ తల్లి, న్యాయస్థానాల జోక్యంతో సుధాకర్ బతికిబట్టగట్టగలిగారని పేర్కొన్నారు. జగన్ అరాచకాలపై పోరాడి కొడుకు సుధాకర్‌ను కాపాడుకున్న వీరమాత కావేరీబాయి అంటూ కొనియాడారు.

    అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ ఘటన లాంటిదే.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి అంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యనించారు. డాక్టర్ సుధాకర్‌పై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అక్కడ జార్జ్ ఫ్లాయిడ్ మెడపై కాళ్లతో తొక్కారని, ఇక్కడ సుధాకర్ పెడరెక్కలు విరిచి కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సంఘాటు, టీడీపీ దళిత విభాగం, సుధాకర్ తల్లి, న్యాయస్థానాల జోక్యంతో సుధాకర్ బతికిబట్టగట్టగలిగారని పేర్కొన్నారు. జగన్ అరాచకాలపై పోరాడి కొడుకు సుధాకర్‌ను కాపాడుకున్న వీరమాత కావేరీబాయి అంటూ కొనియాడారు. దళితుల ప్రాథమిక హక్కులను జగన్ ఇనుప పాదాలతో తొక్కివేస్తున్నారని, సుధాకర్ కేసులో అన్ని వేళ్లూ జగన్ క్యాంప్ ఆఫీసు వైపు చూపిస్తున్నాయని చెప్పారు.

    సుధాకర్ కేసుతో దళిత జాతి వైసీపీకి దూరమైందని, మెంటల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్ రామిరెడ్డిల ఫోన్ కాల్స్ పరిశీలించాలని, సుధాకర్‌ను శారీరకంగా, మానసికంగా హింసించిన డాక్టర్ రామిరెడ్డిని సీబీఐ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళిత వర్గాలు వైసీపీ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండాలని, మెంటల్ ఆస్పత్రిలో సుధాకర్‌కు ఇచ్చిన వైద్యంపై పొరుగు రాష్ట్రాల వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని వర్ల రామయ్య పేర్కొన్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Doctor sudhakar issue, Tdp, Varla ramaiah

    తదుపరి వార్తలు