ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) పై టీడీపీ (TDP) నేతలు స్వరం పెంచుతున్నారు. ముఖ్యంగా పాలన తీరు, హామీల అమలు, టీడీపీ నేతలపై కేసులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, వైఎస్ వివేకా హత్య విషయంలో మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. సీఎం జగన్ పై మండిపడ్డారు. వైసీపీ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదని.. సీఎం తన సొంత మనుషులను కూడా మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. జగన్ తన అధికార, ధనదాహం కోసం ఎవరినైనా మోసం చేస్తారని, చివరకు చంపేందుకు సైతం వెనుకాడరని ఆమె అన్నారు. తన అవసరం కోసం ఎవరినైనా మోసం చేస్తారు, ఊసరవెళ్లి సైతం సిగ్గుపడేవిధంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
అధికారం కోసం ఎన్ని అబద్దాలు ఆడాలో అన్ని అబద్దాలు ఆడారని అనిత ఆరోపించారు. మహిళల బుగ్గలు నిమిరి, తలలు నిమిరారు, మీ పిల్లలకు మేనమామగా ఉంటానన్న చెప్పారనీ.. కానీ అధికారంలోకి వచ్చాక మహిళ మాణ ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించటం లేదని.., ఆడబిడ్డల ఆక్రందనలను జగన్ సంగీతంలా విని ఆనందిస్తున్నారని అనిత ఎద్దేవా చేశారు. జగన్ జైలులో ఉండగా.., షర్మిల తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నికల ప్రచారం చేస్తే... అధికారంలోకి వచ్చాక ఒక్క పదవి కూడా ఇవ్వకుండా ఆమెకు ద్రోహం చేశారని ఆరోపించారు. విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకుని,కన్నీళ్లు పెట్టుకుని ప్రచారం చేస్తే.. ఆమెను అనుమతి లేకుండా ఏపీలో అడుగు పెట్టకుండా చేశారని అనిత ఆరోపించారు.
సొంత చెల్లిని, తల్లిని మోసం చేసిన జగన్ రెడ్డి సొంత భార్యను మోసం చేయడని గ్యారంటీ ఏంటంటూ వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అక్రమాస్తులు భారతి రెడ్డి పేరు మీదే ఉన్నాయని.. కేసులన్నీ ఆమె మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా సాక్షిలో తప్పు రాశారన్న జగన్ ఏదైనా విషయంలో భారతి రెడ్డి బలిచేయడు అని నమ్మకమేంటని అనిత ప్రశ్నించారు. జగన్ పట్ల భారతి అప్రమంత్తంగా ఉండాలి, లేకపోతే ఏదో ఒక రోజు ఆమె కూడా ఆయన బాధితుల జాబితాలో చేరటం ఖాయమని జోస్యం చెప్పారు.
మద్యంపై వచ్చిన అక్రమ ఆదాయంలో వచ్చే ఎన్నికల్లో మహిళల ఓట్లు కొనచ్చని జగన్ అనుకుంటున్నారేమో కానీ మహిళలు డబ్బుకు ఆశపడరని.., ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే చూస్తు ఊరుకోరని అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కి బుద్ది చెప్పేందుకు మహిళలంతా సిద్దంగా ఉన్నారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, TDP, Ys bharathi