జడ్జిలకు కులం అంటగడుతున్నారు.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు..

వైసీపీకీ 151 సీట్లు ఎందుకిచ్చామా అని ప్రభుత్వ బాధపడుతున్నారని తెలిపారు. వేధింపులతో కోడెల శివప్రసాద్‌ను పొట్టన పెట్టుకున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలు పోటీ చేయకుండా బెదిరించారని మండిపడ్డారు.

news18-telugu
Updated: May 28, 2020, 1:24 PM IST
జడ్జిలకు కులం అంటగడుతున్నారు.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan)
  • Share this:
వైసీపీది కక్షపూరిత ప్రభుత్వమని, ఏడాది పాలనలో అన్ని వైఫల్యాలేనని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, టీడీపీ నేతలపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. నాపై ఆరు తప్పుడు కేసులు పెట్టి అధికార దుర్వినియోగం చేస్తున్నారని, వైసీపీకీ 151 సీట్లు ఎందుకిచ్చామా అని ప్రభుత్వ బాధపడుతున్నారని తెలిపారు. వేధింపులతో కోడెల శివప్రసాద్‌ను పొట్టన పెట్టుకున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలు పోటీ చేయకుండా బెదిరించారని మండిపడ్డారు. తెనాలిలో నామినేషన్ వేసిన అభ్యర్థి ఇంట్లో మద్యం పెట్టి.. పోలీసులను ఉపయోగించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సలహాదారు తాడేపల్లిలో సెటిల్‌మెంట్లకు వ్యూహ రచన చేస్తున్నారని, ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆలోచించుకోవాలని సూచించారు. కోర్టు ఆవరణలో చెట్ల కింద పడిగాపులు కాస్తున్న అధికారులను ఓసారి గమనించాలని, కోర్టులు అక్షింతలు వేస్తున్నా జగన్ ప్రభుత్వానికి సిగ్గులేదని చెప్పారు. జడ్జిలకు కులం అంటగడుతున్నారని, టీడీపీకి ఓటేశారని పల్నాడులో పలు గ్రామాలపై దాడులు చేశారని తెలిపారు. మీడియాను వేధింపులకు గురిచేస్తున్నారని, ఏబీఎన్, టీ5 ప్రసారాలను నిలిపేశారని వివరించారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని, రాజధాని మహిళలపై అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు.
First published: May 28, 2020, 1:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading