అప్పుడలా? ఇప్పుడిలానా?... చిరంజీవిపై టీడీపీ నేత ఆగ్రహం...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌కు చిరంజీవి జైకొట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ డోలాయమానంలో పడ్డారు.

news18-telugu
Updated: December 22, 2019, 5:34 PM IST
అప్పుడలా? ఇప్పుడిలానా?... చిరంజీవిపై టీడీపీ నేత ఆగ్రహం...
వైఎస్ జగన్ పాలనను మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్‌తో పోల్చారు.
  • Share this:
పవన్ కళ్యాణ్ పెద్దన్న, మెగాస్టార్ చిరంజీవి మీద టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌కు చిరంజీవి జైకొట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ డోలాయమానంలో పడ్డారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి, అధికారంలోకి రాకపోయేసరికి దాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారన్నారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవి పొంది విభజనపాపంలో భాగమయ్యారని మండిపడ్డారు. తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే ‘పెద్దన్న’కు ఏపీ జనం కష్టాలేం తెలుస్తాయిలే అని అన్నారు.

పరిపాలన వికేంద్రీకణతో అభివృద్ధి సాధ్యమని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారని చిరు కొనియాడారు. రాష్ట్రం విషయంలో నిఫుణుల కమిటీ సిఫారసులు సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయన్నారు.ఇప్పటికే రాష్ట్రం మూడు లక్షలకోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అమరావతిని నిర్మించాలంటే మరో లక్ష కోట్లు అవసరం పడతాయన్నారు. అమరావతిని నిర్మిస్తే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికార కేంద్రీకరణ వల్ల ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతిన్నాయన్నారు చిరంజీవి. ఉమ్మడి ఏపీలో పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 22, 2019, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading