హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

బొత్స ఏదేదో మాట్లాడుతున్నారు..అనువాదం చేయించుకొని విందామన్నా...సోమిరెడ్డి ఫైర్...

బొత్స ఏదేదో మాట్లాడుతున్నారు..అనువాదం చేయించుకొని విందామన్నా...సోమిరెడ్డి ఫైర్...

మాజీ మంత్రి సోమిరెడ్డి(ఫైల్ ఫోటో)

మాజీ మంత్రి సోమిరెడ్డి(ఫైల్ ఫోటో)

బొత్స ఏం మాట్లాడారో అర్ధం కావడం లేదని, ఆయన మాటలు అనువాదం చేయించుకుని విందామన్నా అర్ధంకాని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.

    ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, బాలకృష్ణ అల్లుడు కాబట్టే భరత్‌పై ఏదో ఒక నింద మోపాలని మంత్రి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత్‌ కంపెనీ భూములు ప్రభుత్వ ఆధదీనంలో ఉన్నాయో లేదా ఎవరి ఆధీనంలో ఉన్నాయో మంత్రి బొత్స చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కిరణ్ అయితే ఈ ఒప్పందాలన్నీ బొత్స మంత్రిగా ఉన్నప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో భూముల ఎంవోయూ జరిగిందని గుర్తుచేశారు. అంతే కాదు సీఆర్డీఏ పరిధి తెలియకుండా బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14 నియోజకవర్గాల్లో సీఆర్డీఏ విస్తరించి ఉంటే మంత్రి హోదాలో ఉన్న బొత్స రాజధానిపై స్పష్టత ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారని సోమిరెడ్డి అన్నారు. బొత్స ఏం మాట్లాడారో అర్ధం కావడం లేదని, ఆయన మాటలు అనువాదం చేయించుకుని విందామన్నా అర్ధంకాని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Amaravati, Balakrishna, Botsa, Botsa satyanarayana, Crda, Somireddy chandramohan reddy

    ఉత్తమ కథలు