Home /News /andhra-pradesh /

TDP LEADER PATTABHI REPORTEDLY FLEW TO MALDIVES AS BHOSDIKE CONTROVERSY GROWN BIGGER IN AP MKS

అదిగో..పట్టాభి.. విదేశాలకు జంప్ -టీడీపీ నేత తాజా ఫొటోలు వైరల్ -పిత్తపరిగల కేసుకు భయపడి.

విదేశాలకు పట్టాభి

విదేశాలకు పట్టాభి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపిన బోషిడికే వివాదంలో ప్రధాన నిందితుడైన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విదేశాలకు జారుకున్నారు. ఢిల్లీ వేదికగా జగన్ సర్కారుపై చంద్రబాబు పోరాటాన్ని ఉధృతం చేసిన సమయంలోనే పట్టాభి పెట్టేబేడతో విమానం ఎక్కేసిన దృశ్యాలు వైరలయ్యాయి..

ఇంకా చదవండి ...
కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అలియాస్ పట్టాభి.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది.. ఈయన నోటి నుంచి వెలువడిన మాటలు ఆంధ్రాలో పొలిటికల్ ఫైర్ రాజేయగా.. ఆ సెగలు ఢిల్లీని సైతం తాకాయి.. సీఎం జగన్ ను ఉద్దేశించి ‘బోషిడికే’ అంటూ పట్టాభి తిట్టిన తిట్లు ఆయనను కేసులపాలు చేయగా, టీడీపీ అధినేత అనివార్యంగా ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలను కలిసేలా చేశాయి. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి చంద్రబాబు.. రేపో, మాపో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసేందుకు ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే, మొత్తం వివాదానికి కారకుడైన పట్టాభి మాత్రం ఎంచక్కా విదేశాలకు ఎగిరిపోయారు..

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధికార ప్రతినిధి పట్టాభికి సంబంధించిన తాజా ఫొటోలు సోమవారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సీఎంను బోషిడికే అని దూషించిన కేసులో అరెస్టయిన ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. శనివారం రాత్రి రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ప్రాణాలకు ముప్పుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన దరిమిలా పట్టాభి జాడపై అలజడి రేగింది. కానీ అంతలోనే.. పట్టాభి క్షేమ సమాచారం కుటుంబీకులకు అందిందని, వారితో ఆయన టచ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయినాసరే, బోషిడికే వివాదం తీవ్రత దృష్ట్యా పట్టాభి కదలికలపై చర్చ జరుగుతోంది. ఇంతలోనే..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టాభి


బోషిడీకే వివాదంపై చంద్రబాబు ఢిల్లీలో పోరాటం చేస్తున్న సమయంలోనే టీడీపీ అధికార ప్రతినిది పట్టాభి మాల్దీవులకు చెక్కేశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన విమానం ఎక్కుతోన్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ (ఫ్లైట్ నంబర్ జీ8 1533) ద్వారా పట్టాభి హైదరాబాద్ నుంచి మాలే(మాల్దీవుల రాజధాని)కి ఎగిరెళ్లాడని తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో, విమానం లోపల పట్టాభితో కలిసి ప్రయాణిస్తున్నవారే ఈ ఫొటోలు తీసినట్లుగా ఉంది. కాగా,

బోషిడికే వివాదంలో ట్విస్ట్ : అందుకే జగన్ అలా చేశారు -తల్లిని తిట్టినవాళ్లకు మంత్రి పదవులు: టీడీపీ అయ్యన్నపాత్రుడు ఫైర్


జాతీయ స్థాయిలో దుమారం రేపిన బోషిడికే కేసులో ప్రధాన ముద్దాయి అయిన పట్టాభి.. కేసు విచారణలో ఉండగానే విదేశాలకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. సీఎంను తిట్టిన కేసులో బెయిల్ పొందిన పట్టాభిపై మరికొన్ని కేసులు పెట్టాలని వైసీపీ శ్రేణులు భావిస్తోన్న క్రమంలోనే ఆయన మాల్దీవులకు వెళ్లిపోవడం గమనార్హం. సీఎంను దూషించిన వ్యవహారంలో షేక్ మస్తాన్ అనే విజయవాడకు చెందిన వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు పట్టాభిపై కేసు నమోదు చేశారు. అదే ప్రెస్ మీట్ లో పట్టాభి వాడిన మరో పదజాలంపై విజయనగరం జిల్లాలో కేసు నమోదుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.

Chandrababu ఫిర్యాదుతో రాష్ట్రపతి సీరియస్ -Jaganపై యాక్షన్! -ఏమిటీ శారీరక, మానసిక, ఆర్థిక దాడి?


సీఎంను బోషిడికే అన్న పట్టాభి.. ‘మేమేమైనా పిత్తపరిగలు ఏరుకునే వాళ్లలా కనిపిస్తున్నామా?’అని వైసీపీ నేతలకు సవాలు విసరడాన్ని మత్స్యకారులు సీరియస్ గా తీసుకున్నారు. పిత్తపరిగెలు ఏరుకునేవాళ్లంటూ మత్సకారుల్ని కించపరిచేలా మాట్లాడిన పట్టాభిపై విజయనగరం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై మంత్రి సీదరి అప్పలరాజు సైతం మొన్నటి జనాగ్రహ దీక్షలో నిప్పులు చెరిగారు. పిత్తపరిగెల కేసుతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు, అరెస్టులు తప్పవనే బయంతోనే లాయర్ల సూచన మేరకు టీడీపీ నేత పట్టాభి విదేశాలకు జారుకున్నాడని తెలుస్తోంది. పట్టాభి ఒంటరిగానే మాల్దీవులకు వెళ్లారా లేక ఫ్యామిలీ కూడా వెళ్లిందా అనేదానిపై క్లారిటీ రాలేదు..
Published by:Madhu Kota
First published:

Tags: Ap cm jagan, Chandrababu naidu, Maldives, Tdp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు