Home /News /andhra-pradesh /

TDP LEADER NARA LOKESH TWEET ON AP SCHOOLS TO CONTINUE HOLIDAY TILL JANUARY 30TH IF OPEN IT IS DANGER FOR STUDENTS NGS

AP Schools: ఏపీలో స్కూల్స్ కు 30 వరకు సెలవులు ఇవ్వండి.. ప్రారంభించడం పెను ప్రమాదం.. నారా లోకేష్ ట్వీట్

పాఠశాలల్లో కరోనా డేంజర్ బెల్స్

పాఠశాలల్లో కరోనా డేంజర్ బెల్స్

AP Schools: ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ పున: ప్రారంభంపై వివాదం కొనసాగుతోంది. సంక్రాంతి సెలవుల తరువాత స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి. అయితే తొలిరోజు పిల్లలను పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపించలేదు.. అయితే తాజాగా స్కూల్స్ రీ ఓపెనింగ్ చేయడంపెను ప్రమాదం అంటూ అభిప్రాయపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. 30 వరకు సెలవులను పొడిగించాలని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
    Nara Lokesh on AP Schools: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం కరోనా వైరస్ (Corona Virus) తీవ్రత చాలా వేగంగా పెరుగుతోంది. సంక్రాంతి  (Sankranti) పేరుతో చాలామంది నిబంధనలకు నీళ్లు వదిలేశారు. మరోవైపు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ (Night Curfew) అమలు చేస్తున్నా.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది అన్నది నిపుణుల మాట.. అయితే సెలవులు అనంతరం ఏపీలో స్కూల్స్ రీస్టార్ట్ అయ్యాయి.  ఏపీ ప్రభుత్వం (AP Governemnt) స్కూల్స్ కు సెలవులను పొడిగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.  ఉపాధ్యాయులకు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minster Adimulapu Suresh). మరీ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు చూద్దామని వివరణ ఇచ్చారు. అయితే పాఠశాలల రీ ఓపెన్ పై విపక్షాలు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ అంశంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy)కి లేఖ రాశారు.

    దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని పేర్కొన్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదన్నారు లోకేష్. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని ఆయన తన ట్విట్టర్ లో సూచించారు. గత పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. నిత్యం నాలుగువేలకుపైగా కేసులు నమోదవుతున్నాయనన్నారు. కేవలంగడిచిన పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి వచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు.



    ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో ఎంతోమంది ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పేరెంట్స్ ను మరింత మానసిక ఆందోళనకు గురి చేయకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కోరారు. తక్షణమే స్కూల్స్​కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.  ఇదీ చదవండి : పాఠశాలలకు సెలవులు పొడింగింపు.. ఆన్ లైన్ క్లాసులపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ.. ఏమన్నారంటే?

    విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేసిన కాసేపటికే ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిసింది. తనకు పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని.. హోం ఐసోలేషన్ లో ఉంటున్నాను అన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ లో కోరారు..



    అయితే నారా లోకేష్ సహా విపక్షాల డిమాండ్ ఎలా ఉన్నా.. పాఠశాలల రీ ఓపెన్ విషయంలో ప్రభుత్వం ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. అయితే జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించింది. ఆన్ లైన్ విద్యావిధానం మనకు ప్రత్యామ్నాయం కాదన్నారు.. విద్యార్థుల భవిష్యత్తు కు ఆల్ పాస్ విధానం కరెక్టు కాదని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు