Home /News /andhra-pradesh /

TDP LEADER NARA LOKESH SLAMS YS JAGAN OVER LIQUOR SHOPS OPEN IN AP SK

ఏపీ 'జగనన్న బీరు పండగ'.. నారా లోకేష్ సెటైర్లు

నారా లోకేష్, వైఎస్ జగన్

నారా లోకేష్, వైఎస్ జగన్

లాక్‌డౌన్ సమయంలో వైసీపీ ఎలుకలు తాగిన మద్యం లెక్కలు సరిచేసేందుకే మద్యం అమ్మకాలకు పచ్చ జెండా ఊపారని ధ్వజమెత్తారు లోకేష్.

    ఏపీలో మద్యం అమ్మకాలపై రాజకీయ దుమారం రేగుతోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్మకాలకు ఎందుకు అనుమతిచ్చారు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. లిక్కర్ కంపెనీ ఒత్తిడి మేరకే మద్యం ధరలను పెంచారని దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా నారా లోకేష్ సైతం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న బీరు పండగ ఘనంగా ప్రారంభమయ్యిందని సెటైర్లు వేశారు. లాక్‌డౌన్ సమయంలో వైసీపీ ఎలుకలు తాగిన మద్యం లెక్కలు సరిచేసేందుకే మద్యం అమ్మకాలకు పచ్చ జెండా ఊపారని ధ్వజమెత్తారు లోకేష్.

    రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో జగనన్న ''బీరు పండుగ'' ఘనంగా ప్రారంభమయ్యింది.మద్యనిషేదం మాటున చీకటి దందా యథేచ్ఛగా సాగుతుంది. మద్యనిషేధం అంటే రేట్లు పెంచడం, వైన్ కేసుల్లో కమీషన్లు తీసుకుని ప్రమాదకరమైన లిక్కర్ అమ్మి జనాల ఆరోగ్యంతో చెల‌గాట‌మాడ‌ట‌మ‌ని జగన్ గారు స‌రికొత్త అర్థం చెప్పారు. లాక్‌డౌన్ టైములో వైకాపా ఎల‌క‌లు తాగిన కోట్ల రూపాయ‌ల‌ మ‌ద్యం లెక్క‌లు స‌రిచేసేందుకే వైన్ సేల్స్‌కి గ్రీన్‌సిగ్న‌లిచ్చారు.
    లోకేష్


    లాక్‌డౌన్ 3పై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచారు. ఇన్ని రోజుల తర్వాత వైన్ షాప్‌లు ఓపెన్ కావడంతో మద్యం బాబుల ఆనందానికి అవధులు లేవు. రేట్లు పెంచినప్పటికీ మద్యం కోసం ఎగబడుతున్నారు. ఏపీలో ఉదయం నుంచే వైన్ షాప్‌లకు జనాల తాకిడి పెరిగింది. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లు కనిపిస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్కల చేయకుండా ఒక్క సీసా మందు కోసం కష్టపడుతున్నారు మద్యం ప్రియులు. పలు చోట్ల మందుబాబు సామాజిక దూరం పాటించడం లేదు. వందలాది మంది ఒక్క చోట చేరి గుంపులు గుంపులుగా చేరుతున్నారు. ఇలాగే వ్యవహరిస్తే కరోనా వ్యాప్తి మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, AP News, Liquor sales, Liquor shops, Nara Lokesh, Wine shops

    తదుపరి వార్తలు