హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: వారు మాట్లాడే భాషకు నేరుగా ఉరి తీయాలి.. పోలీసులకు మాత్రం కమ్మగా వినిపిస్తున్నాయా..?

Nara Lokesh: వారు మాట్లాడే భాషకు నేరుగా ఉరి తీయాలి.. పోలీసులకు మాత్రం కమ్మగా వినిపిస్తున్నాయా..?

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

Nara Lokesh: టీడీపీ నేతలు వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడతారు..? అరెస్టులు చేస్తారు.. అదే వైసీపీ నేతలు అవస్తవాలు చెప్పినా.. ఆఖరికి బూతులు తిట్టినా.. పోలీసులకు మాత్రం వారి మాటలు కమ్మగా అనిపిస్తున్నాయా..? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.

ఇంకా చదవండి ...

  P Anand Mohan, Visakhapatnam, News18.                     Nara Lokesh: ఏపీ ప్రభుత్వం (AP Government) చేస్తున్న దారుణాలు.. రాక్షస పాలనపై ఎవరైనా నిలదీయడమే పాపం అయిపోయింది అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ (Nara Lokesh).. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైనా.. ప్రభుత్వానికి ఒక్క మాట అంటే చాలు.. పోలీసులు కేసులు, అరెస్టులు అంటూ హంగమా చేస్తున్నారని.. తెలుగుదేశం నేతలు వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఉచ్ఛనీచాలు మరచి మాట్లాడుతున్న వైసీపీ నేతల (YCP Leaders) బూతులు వినసొంపుగా ఉన్నాయా? అంటూ ఆయన నిలదీశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu)కి నోటీసులు ఇచ్చేందుకు ఇతర జిల్లా పోలీసులు రావడంపై స్పందించిన నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం స్పందించని పోలీసులు.. జిల్లాలు దాటి మరీ టిడిపి నేతల్ని అరెస్ట్ చేయడానికి రావడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని లోకేష్ ఆరోపించారు..

  తెలుగు దేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని.. అలాంటప్పుడు వైసిపి నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలి కదా అని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.

  పోలీసుల చొక్కా పట్టుకొని తిడుతున్న మంత్రులు, బీరు బాటిళ్లు పగలగొట్టి ఏం చేస్తారని సవాల్ చేస్తున్న వైసిపి నేతలపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపి ప్రజాస్వామ్యాన్ని కాపాడితే.. కనీసం వేసుకున్న ఖాకీ గౌరవాన్ని నిలబెట్టినవారవుతారని లోకేష్ అభిప్రాయపడ్డారు. టీడీపీ టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.

  మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి వచ్చిన పోలీసులు విశాఖ జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడి ఇంటివద్దా చాలా సేపటినుంచి భైఠాయించారు. ఇటీవల నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లిన అయ్యన్నపాత్రుడు..సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. స్థానిక వైసీపీ నేత రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ నోటీసు ఇచ్చేందుకు నల్లజర్ల సీఐ రఘు, ఎస్ఐలు శ్రీహరి రావు, అవినాష్ లు.. నర్సీపట్నంలో అయ్యన ఇంటికి వుళ్లారు. అయితే అయ్యన్న పాత్రుడు ఇంటిలో లేరంటూ కుటుంబ సభ్యులు చెప్పగా.. ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉండి నోటీసులు ఇచ్చాకే వెళ్తామంటూ తన సిబ్బందితో కలిసి సీఐ అక్కడే భైఠాయించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP, Ycp

  ఉత్తమ కథలు