హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: సీఎం వరద పర్యటన దేనికి.. పరామర్శకా? సెల్ఫీల కోసమా? లోకేష్ ఫైర్

Nara Lokesh: సీఎం వరద పర్యటన దేనికి.. పరామర్శకా? సెల్ఫీల కోసమా? లోకేష్ ఫైర్

వరద పర్యటనలో సెల్ఫీలా..?

వరద పర్యటనలో సెల్ఫీలా..?

AP Flood Politics: ఆంధ్రప్రదేశ్ లో వరదలపైనా రజకీయం రచ్చ రచ్చ అవుతోంది. వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటనపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యటనకు వెళ్లింది పరామర్శలకా..? సెల్ఫీలకా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

  Andhra Pradesh Flood Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని వరదలపైనా రాజకీయాలు రచ్చ రచ్చ అవుతున్నాయి.  ప్రస్తుతం వరద  ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు కడప జిల్లాలో పర్యటించిన సీఎం.. రెండో రోజు తిరుపతి (Tirupathi) లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ప్రస్తుతం  తిరుపతి రూరల్ మండలం, పాడిపేటలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు.. తరువాత స్వర్ణముఖి నది ఒడ్డున వరద తీవ్రతను తెలిపే ఫోటో గ్యాలరీను సీఎం పరిశీలించారు.‌ వరద తీవ్రతను జగన్ కు జిల్లా కలెక్టర్ వివరించారు.. తరువాత స్వర్ణముఖి నదిపై నిర్మించిన బ్రిడ్జ్ వరద ఉధృతికి కొట్టుకు పోయిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి పరిస్ధితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు..  శ్రీకృష్ణానగర్ లో వరద తీవ్రత తెలిపే పోటో ప్రదర్శనను తిలకించారు.

  ఈ పర్యటనపైనా రాజకీయాలు ఆగడం లేదు. సీఎం తీరుపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ (nara lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది ఎందుకంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ… మీరు వెళ్లింది మీ ఇసుక మాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యులను పరామర్శించడానికి. మీ వంధిమాగదులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు..


  ‘మీరు వెళ్లింది.. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ‌చ్చిన విప‌త్తు వ‌ల్ల జ‌రిగిన వేల‌కోట్ల న‌ష్టం ప‌రిశీలించ‌డానికి. ప్రజల్ని దూరం పెట్టి ప‌ళ్లు ఇకిలిస్తూ ఫోటోలు దిగ‌డానికి కాదు అంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు. జ‌నం బాధ‌లు మీకు అంత పైశాచిక‌ ఆనందం క‌లిగిస్తున్నాయా? అని లోకేష్ ప్రశ్నిస్తున్నారు.


  లోకేష్ షేర్ చేసిన ఫోటోలో సీఎం జగన్‌తో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నారు. అంతేకాకుండా వరద బాధితులతో సీఎం జగన్ నవ్వుతున్న ఫోటోలను కూడా లోకేష్ షేర్ చేశారు. కాగా ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

  ఇదీ చదవండి: ఉత్తరాంధ్రకు తప్పని ముప్పు.. బలపడిన వాయుగుండం.. రెండు రోజులు స్కూళ్లకు సెలవు

  ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా  మారాయి.. సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం వరద ప్రాంతాల పర్యటనపై సెటైర్లు వేస్తున్నారు విపక్షాల అభిమానులు, కార్యకర్తలు, రాయలసీమను వరద ముంచెత్తితే.. రాజకీయ పర్యటన చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

  ఇదీ చదవండి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోముకు చెక్ పెడుతున్నారా..? వైసీపీతో ఫ్రెండ్ షిప్పే కారణమా..?

  విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా..  సీఎం జగన్.. వరద బాధితులను అన్నిరకాలుగా అండగా ఉంటామని హమీ ఇచ్చారు. రేపటి నుంచే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీ  ఇచ్చారు జగన్..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP Floods, AP News, Cm jagan, Nara Lokesh

  ఉత్తమ కథలు