హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోంది.. వైరల్ గా నారా లోకేష్ పోస్ట్

Nara Lokesh: పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోంది.. వైరల్ గా నారా లోకేష్ పోస్ట్

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై జాలీ చూపిస్తూనే.. అసహ్యమేస్తోంది అంటూ నారాలోకేష్ పోస్ట్ చేశారు. పోలీసులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నా.. వారి అరాచకాలకి కొమ్ముకాస్తున్నారని వాపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

  Nara Lokesh on YCP: చేతిలో అధికారం ఉండడంతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు కొందరు.. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు కొందరు.. తాము ఏం చేసినా ఎదురు చెప్పేవారు లేరు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలైన తమకే ఎదురు సమాదానం చెబుతారా అంటూ రెచ్చిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మద్యం సేవించి పోలీసులు పై తిరగబడ్డాడు ఓ వైసీపీ నేత. విశాఖ జిల్లా (Visakha District) మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పోలీస్ చేసిన పాపం ఏంటి అంటే..? ఆర్ఆర్ రెస్టారెంట్ లో కొందరు వ్యక్తులు మద్యం సేవించి గొడవ పడ్డారు. ఎంతకూ గొడవ సద్దుమణగకపోవడంతో రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మద్యం సేవించి ఉన్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అంతే దీంతో వైసీపీ నేతలు (YCP Leaders) రెచ్చిపోయారు.. అధికార పార్టీ నేతలకే ఎదురు చెబుతావా అంటూ నానాయాగి చేశారు.

  పోలీసుతో గోడపడ్డ వారిలో ఒకరు పాకలపాడు వైసీపీ నేత, ఎంపీటిసి భర్త యళ్ల నాయుడు ఉండగా, మరొకరు విద్యా కమిటీ చైర్మన్ నానాజీ ఉన్నారు. వీరు తప్పతాగి పోలీసులుపై వీరంగం సృష్టించారు. పోలీస్ ద్విచక్ర వాహనాన్ని అడ్డుకుని అసభ్యపదజాలంతో దూషించారు. ద్విచక్ర వాహనంపై పోలీసు కూర్చుని ఉండగానే.. మద్యం బాటిల్ పగలకొట్టి, సీటుపై బిర్యానీ పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. అధికారపార్టీ నేతలమని, తమకు ఎమ్మెల్యే తెలుసని.. పోలీసులు ఏం చేయలేరు అంటూ హల్ చల్ చేస్తూ.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు.

  ఇదీ చదవండి : జనసేనకు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. ప్రభుత్వం అలా చేసేది కాదు.. జీవోను చింపేసిన పవన్

  ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోందని లోకేశ్ అన్నారు. పోలీసులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నా.. వారి అరాచకాలకి కొమ్ముకాస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ తొత్తులుగా మారిన పోలీసులు.. ప్రశ్నించే ప్రజలు- ప్రతిపక్ష టీడీపీ నేతలపై దాడులకి తెగబడ్డారని ఆరోపించారు. ఇన్ని చేసినా కొంతమంది పోలీసులు చివరికి వైసీపీ మూకలకు బాధితులు అవుతున్నారని వాపోయారు.

  తాజాగా విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకున్న వీడియో లింక్ ను పోస్ట్ లో పెట్టారు. అలాగే సీఐతో మంత్రి సీదిరి అప్పలరాజు దురుసు ప్రవర్తన, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఎంపీ నందిగం సురేష్ రౌడీ మూకల దాడి ఎలాంటి దారుణాలు ఎన్నో అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకే రక్షణ లేని రాష్ట్రంలో ప్రజలను కాపాడేదెవరు? అని నారా లోకేశ్ ప్రశ్నించారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP, Visakhapatnam

  ఉత్తమ కథలు