హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: నో పోలీస్ అంటూ.. మామ డైలాగ్ లను దింపేసిన నారా లోకేష్

Nara Lokesh: నో పోలీస్ అంటూ.. మామ డైలాగ్ లను దింపేసిన నారా లోకేష్

Nara Lokesh: గతంతో పోలీస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. పంచ్ డైలాగ్ లతో వైసీపీ నేతలను ఒక ఆటాడుకుంటున్నారు.. తాజాగా ట్విట్టర్ వేదికగా నో పోలీస్.. అంటూ మామ డైలాగ్ లను కాపీ కొట్టారు..

Nara Lokesh: గతంతో పోలీస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. పంచ్ డైలాగ్ లతో వైసీపీ నేతలను ఒక ఆటాడుకుంటున్నారు.. తాజాగా ట్విట్టర్ వేదికగా నో పోలీస్.. అంటూ మామ డైలాగ్ లను కాపీ కొట్టారు..

Nara Lokesh: గతంతో పోలీస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. పంచ్ డైలాగ్ లతో వైసీపీ నేతలను ఒక ఆటాడుకుంటున్నారు.. తాజాగా ట్విట్టర్ వేదికగా నో పోలీస్.. అంటూ మామ డైలాగ్ లను కాపీ కొట్టారు..

  Nara Lokesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం  గుడివాడ క్యాసినో (Gudivada Casina Issue) హాట్ టాపిక్ అయ్యింది.   ముఖ్యంగా అధికార  వైసీపీ  (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతల మద్య మొదలైన డైలాగ్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది.  మొదట గుడివాడ కే పరిమితమైన వ్యవహారం  విజయవాడ కు షిఫ్ట్ అయ్యింది.  ఈ వ్యవహారానికి ప్రధాన కారణం  మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) అన్నది టీడీపీ వాదన..  మంత్రి కనుసన్నల్లోనే ఈ తతంగమంతా జరిగింది అన్నది తెలుగు దేశం వాదన. అయితే ఈ ఆరోపణలు అక్కడికే పరిమితం అవ్వలేదు.. క్యాసినోకుక సంబంధించి ఏపీ డీజీపీ   గౌతమ్ సవాంగ్ కు తెలిసే జరుగుతోందని ఆరోపణలు చేశారు. దీంతో టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్ని ఆజ్యం పోశాయి.  దీంతో మొదట విచారణ చేస్తామంటూ వచ్చిన పోలీసులు.. టీడీపీ నేతల ఆందోళనలే మధ్యే బుద్దా వెంకన్నను అరెస్ట్ చేశారు. చివరికి స్టేషన్ బెయిల్ పై అర్థరాత్రి విడుదల చేశారు. అయితే ీ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. స

  బుద్దా వెంకన్న అరెస్ట్.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మడిపడ్డారు. ఈ సందర్భంగా మామ డైలాగ్ లను గుర్తు చేస్తూ.. ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు.. గుడివాడ‌లో మంత్రి కొడాలి నాని క్యాసినో న‌డిపితే నో పోలీస్‌.. అదే గ‌డ్డం గ్యాంగ్ ప్ర‌తిప‌క్ష‌నేత‌ని బూతులు తిడితే నో పోలీస్‌.. చంద్రబాబు గారి ఇంటి పై దాడి చేస్తే నో పోలీస్‌.. టిడిపి కేంద్ర కార్యాల‌యాన్ని వైసీపీ మూక‌లు ధ్వంసం చేస్తే నో పోలీస్‌. అంబూ బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేసిన వీడియోను లింక్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నారా లోకేష్..


  మంత్రి స్థానంలో ఉండి బూతులేంటి అని బుద్ధా వెంక‌న్న నిల‌దీస్తే బిల‌బిల‌మంటూ వ‌చ్చి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారని.. అసలు ఏపీ పోలీసులు ప్ర‌జార‌క్ష‌ణ‌కి ఉన్నారా? నేరాలు చేసే వైసీపీ నేత‌లకు కాప‌లా కాస్తున్నారా? అని లోకేష్ ప్రశ్నించారు. బుద్ధా వెంక‌న్న అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.


  గుడివాడలో క్యాసినో వ్యవహారంపై టిడిపి నేతలు ఫిర్యాదు చెయ్యడానికి వెళితే కనీసం అనుమతించని డీజీపీ.. ఐపీఎస్ ముసుగులో ఎన్నాళ్లిలా వైసీపీ కోసం పనిచేస్తారు అని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీలో చేరితే వాటాల్లేకుండా మీరే క్యాసినో నడుపుకోవచ్చు కదా అని లోకేష్ ఘాటుగా ట్వీట్ల వర్షం కురిపించారు.


  ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే బుద్ధ వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బుద్ద  చేసిన విమర్శలనే.. ఇప్పుడు లోకేష్ ట్విట్టర్ వేదికగా చేశారు. డీజీపీకి వాటాలు ఉన్నాయనే అర్థం వచ్చేలా వ్యాఖ్యనించారు. దీంతో మరి లోకేష్ కి కూడా నోటీసులు అందినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు టీడీపీ నేతలు.. పోలీసుల బెదిరింపులకు భయపడిదే లేదంటున్నారు..  దీంతో ీ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంది..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు