హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: ఏపీ సీఎం జగన్ కంటే ఉత్తర కొరియా కిమ్ నయం..? ఎందుకంటే..? లోకేష్ కామెంట్

Nara Lokesh: ఏపీ సీఎం జగన్ కంటే ఉత్తర కొరియా కిమ్ నయం..? ఎందుకంటే..? లోకేష్ కామెంట్

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో )

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో )

Nara lokesh slams cm Jagan: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శ దాడి పెంచారు. తాజాగా సీఎం జగన్ ను ఉత్తర కొరియా నియంత కిమ్ కంటే దారుణం అంటూ విమర్శించారు.. ఇంతకీ ఎందుకు అలా అన్నారో తెలుసా.?

  Nara Lokesh slams on CM Jagan:  టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఇటీవల విమర్శల దాడి పెంచారు. ఓ వైపు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy), వైసీపీ నేతల తీరును ఇటు సోషల్ మీడియా (Social Media)లోనూ.. సమావేశాల్లోనూ ఎండగడుతున్నారు. తాజాగా సీఎం జగన్ తీరుపై ఘాటు విమర్శలు చేశారు.  ఏపీ సీఎం జగన్‌పై  మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురం జిల్లా (Anantapuram District)లో  ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ (Minster Botsa Satyannarayana) కాన్వాయ్‌ను తమ సమస్యల పరిష్కారం కోసం అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు.

  ప్రభుత్వం తీరును తప్పు పడుతూ ఆయన ఓ ట్వీట్ చేశారు.  ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకంటూ ఏపీ సర్కారుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించే ప్రజలను, విద్యార్థి సంఘాలను అక్రమంగా అరెస్టులు చేయించడం జగన్‌కే చెల్లింది అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్న జగన్ కంటే ఉత్తరకొరియా కిమ్ బెటరంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.


  అనంత‌పురం జిల్లా కేంద్రంలో ఓ స‌మావేశంలో పాల్గొనేందుకు వ‌చ్చిన‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కాన్వాయ్‌ని అడ్డుకుని, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేయ‌డ‌మే విద్యార్థిసంఘాల నేత‌లు చేసిన‌ భ‌యంక‌ర‌మైన నేర‌మ‌న్న‌ట్టు అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

  అనంత‌పురం జిల్లా కేంద్రంలో ఓ స‌మావేశంలో పాల్గొనేందుకు వ‌చ్చిన‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కాన్వాయ్‌ని అడ్డుకుని, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేయ‌డ‌మే విద్యార్థిసంఘాల నేత‌లు చేసిన‌ భ‌యంక‌ర‌మైన నేర‌మ‌న్న‌ట్టు అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. .(1/2) pic.twitter.com/TRjn1JHwEJ


  పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసి అమలు చెయ్యాలి. ఇచ్చిన హామీ ప్రకారం తాత్సారం చెయ్యకుండా సిపిఎస్ రద్దు చెయ్యాలి. రూ.1600 కోట్లు వెంటనే విడుదల చెయ్యాలి. పెండింగ్లో పెట్టిన 7 డిఏలు వెంటనే ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి అని లోకేష్ డిమాండ్ చేశారు.


  ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. కనీసం వారిని మనుషుల్లా కూడా చూడకుండా ప్రభుత్వ పెద్దలు అవమానిస్తున్న తీరు బాధాకరం. ఆఖరికి ఉద్యోగులు దాచుకున్న రూ.1600 కోట్లను ప్రభుత్వం ఇవ్వక పోవటం దారుణం.


  గత కొన్ని రోజుల నుంచి పరిశీలిస్తే నారా లోకేష్ విమర్శల్లో పదును పెరిగింది. దీంతో తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. త్వరలో ఆయన పాద యాత్రకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు