Maganti Ramji: టీడీపీలో తీవ్ర విషాదం.. యువనేత మాగంటి రాంజీ కన్నుమూత..

Maganti Ramji: టీడీపీలో తీవ్ర విషాదం.. యువనేత మాగంటి రాంజీ కన్నుమూత..

మాగంటి రాంజీ (Image-Twitter)

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు రాంజీ ఆదివారం కన్నుమూశారు.

  • Share this:
    మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు రాంజీ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వివరాలు.. రాంజీ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఏలూరు ఆంధ్రా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రాంజీ పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మరణించారు. ఇక, రాంజీ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. దీంతో ఆ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత.. రాంజీ భౌతికకాయం ఏలూరులోని మాగంటి నివాసానికి తరలించనున్నారు.

    అయితే మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నం చేశారని కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగింది. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఆయన అనారోగ్య కారణాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

    ఇక, టీడీపీ యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాంజీ.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. తండ్రి మాగంటి బాబుకు పార్టీపరంగా చేదోడువాదోడుగా ఉండేవారు. ఇక, రాంజీ మృతితో మాగంటి బాబు కుంటుంతో పాటుగా, టీడీపీ శ్రేణులో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.





    సంతాపం తెలిపిన చేసిన నారా లోకేష్..
    మాగంటి రాంజీ మృతిపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ (Nara Lokesh) సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "లోకేష్ అన్నా అంటూ పిలిచే ఆ పిలుపు ఇక విన‌ప‌డ‌దు.మాగంటి రాంజీ మ‌న‌కి దూరం అయిపోయాడు.తెలుగుదేశానికి అండ‌గా ఉంటానంటూ జెండా ప‌ట్టిన ప‌సుపు సైనికుడా నీ మ‌ర‌ణం పార్టీకీ,నాకూ తీర‌ని లోటు. నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ నీ మరణానికి క‌న్నీటి నివాళి అర్పిస్తున్నాను. రాంజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు