TDP LEADER KOMMAREDDY PATTABHI SLAMS CM YS JAGAN OVER STATE FINANCIAL SITUATION FULL DETAILS HERE PRN
Andhra Pradesh: అందుకే ఏపీ దివాళా తీసింది.. కేంద్రం లేఖను బయటపెట్టిన టీడీపీ..
టీడీపీ నేత పట్టాభి (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై కొన్నాళ్లుగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ (CM Jagan) సర్కార్ వైఫల్యంతో రాష్ట్రం దివాళా తీసిందని.. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై కొన్నాళ్లుగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ (CM Jagan) సర్కార్ వైఫల్యంతో రాష్ట్రం దివాళా తీసిందని.. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ఉచిత పథకాలు, అవినీతితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా.. అప్పుల్లోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ అధికార ప్రతినిథి కొమ్మారెడ్డి పట్టాభి.. జగన్ సర్కార్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం నడుస్తోందని.., ఆర్థిక క్రమశిక్షణ లోపించడంవల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాళా తీసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లూటీ వల్ల నేడు వరల్డ్ బ్యాంక్, ఏఐఐబి, ఎన్డిబి వంటి ప్రపంచ ఆర్థిక సంస్థలు ఒక్క పైసా నిధులిచ్చే పరిస్థితుల్లో లేవని మండిపడ్డారు.
ఏపీలో అప్పులు, నిధుల దుర్వినియోగంపై కేంద్రం కూడా గుర్రుగా ఉందని పట్టాభి అన్నారు. అంతేకాదు ఈనెల 17వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ ప్రసన్న రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ ప్రపంచ బ్యాంకుల నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఘాటైన లేఖ రాశారన్నారు. ఏఐఐబి, ఎన్డిబి బ్యాంకుల నుండి లోన్ అడ్వాన్సులు ఇప్పించ వలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాయగా వారు దానిని నిర్ద్వందంగా తిరస్కరించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రపంచ బ్యాంకుల నుండి ఏ విధమైన నిధులు విడుదల కావాలన్నా తాము విధించిన షరతులను తక్షణమే అమలుపరచాలని ఖరాఖండిగా చెప్పిందన్నారు.
కేంద్ర ఆర్థికశాఖ రాసిన లేఖ జగన్ సర్కార్ కి చెంపపెట్టు అని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. గతంలో వివిధ బ్యాంకుల నుండి అడ్వాన్సుల రూపంలో డ్రా చేసిన సొమ్ములకు కూడా తక్షణమే లెక్కలు చెప్పాలని కేంద్రం ఆదేశించిందని.., వివిధ ప్రాజెక్టుల పేరుతో రుణాలు పొంది దారి మళ్లించిన నిధులను కూడా తక్షణమే ఆయా పీఐఏలకు (ప్రాజెక్టు ఇంప్లిమెంటింగ్ అథారిటీ)లకు జమ చేయాలని స్పష్టం చేసినట్లు తెలిపారు.
ఇకమీదట ప్రతినెల రుణాలు పొందిన వివిధ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఆర్థిక పరమైన మరియు భౌతిక పురోగతికి సంబంధించిన నివేదికలు తప్పక కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించాలని షరతు విధించిందన్న విషయాన్ని పట్టాభి గుర్తు చేశారు. కేంద్రం లేఖ ద్వారా రోడ్లు మరియు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో వైసీపీ సర్కార్ చేసిన దోపిడి సుస్పష్టమౌతోందని విమర్శించారు. . ఇప్పటివరకు రోడ్లపై ఉన్న గుంతలను కూడా పూడ్చలేక పోతున్న ప్రభుత్వం ఈ లేఖకు ఏం సమాధానం చెబుతుందని పట్టాభి ప్రశ్నించారు.
ఇక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన అజ్ఞాతవాసాన్ని వీడి మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకు ఈ లేఖపై వివరణ ఇవ్వాలని పట్టాభి డిమాండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీపై ఇంత తీవ్రంగా స్పందించిన తీరుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పట్టాభి అన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.