కోడెలకు ఊరట...ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు...

కోడెల శివ ప్రసాద్(ఫైల్ ఫోటో)

సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్‌ స్టేషన్లలో కోడెల కుటుంబసభ్యులపై మొత్తం ఐదు కేసులు నమోదు కాగా, ముందస్తు బెయిల్‌ కోసం వారు కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

  • Share this:
    ఏపీ టిడిపి నేత కోడెల శివప్రసాద్ రావు, ఆయన కుమారుడు శివరామ్‌కు ముందస్తు బెయిల్‌ లభించింది. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, విచారణ జరిపిన న్యాయస్థానం, వీరిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్‌ స్టేషన్లలో కోడెల కుటుంబసభ్యులపై మొత్తం ఐదు కేసులు నమోదు కాగా, ముందస్తు బెయిల్‌ కోసం వారు కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
    Published by:Krishna Adithya
    First published: