Home /News /andhra-pradesh /

TDP LEADER GV REDDY COMMENTS ON YSRCP GOVERNMENT OVER INDUSTRIES ISSUE UMG

చంద్రబాబు హయాంలోనే ఏటీసీ కంపెనీ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్న టీడీపీ

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

టీడీపీ (TDP) హయాంలో ఒప్పందాలు కుదిరిన పరిశ్రమలకు ముఖ్యమంత్రి (AP CM) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS JaganMohan Reddy) శంకుస్థాపనలు చేసి వాటిని తామే తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి (GV Reddy) ధ్వజమెత్తారు. జూమ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు దేశ విదేశాలకు తిరిగి అనేక కంపెనీలు, పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చున్నారని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని తమ ఘనతగా చెప్పుకొంటోందని ఆరోపించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    టీడీపీ (TDP) హయాంలో ఒప్పందాలు కుదిరిన పరిశ్రమలకు ముఖ్యమంత్రి (AP CM) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS JaganMohan Reddy) శంకుస్థాపనలు చేసి వాటిని తామే తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి (GV Reddy) ధ్వజమెత్తారు. జూమ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు దేశ విదేశాలకు తిరిగి అనేక కంపెనీలు, పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చున్నారని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని తమ ఘనతగా చెప్పుకొంటోందని ఆరోపించారు. ఏటీసీ టైర్ల కంపెనీని తానే తెచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

    "ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలంటే కనీసం రెండు సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది. కంపెనీ పెట్టేముందు ఆ కంపెనీ ప్రతినిధులు లాభ నష్టాలను అంచనా వేసుకుని, ఇతర సౌకర్యాలు, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. ఈ ప్రాసెస్ జరగడానికి సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. కంపెనీ మొదలు పెట్టడానికి రెండు సంవత్సరాలు పడితే, ప్రొడక్షన్ తయారి ప్రారంభం అవడానికి మరో రెండు సంవత్సారాలు పడుతుంది. చంద్రబాబు నాయుడు 2018లో ఏటిసి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపి వాళ్లకి స్థలం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకుంటాం అని చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత 2019 నవంబర్ లో ఏటీసీ కంపెనీ రిజిష్టర్ అయింది. ఇప్పుడు ఉత్పత్తికి ప్రారంభించింది" అని జీవీ రెడ్డి అన్నారు.

    ఇదీ చదవండి: ఏసీ బోగీల్లో పాడు పనులు.. రాత్రిళ్లు ఆడవాళ్లు పడుకున్న తర్వాత.. సైలెంట్‌గా పని కానిచ్చేస్తారు..!


    జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న పరిశ్రమలని వెళ్ల గొడుతున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. ఎప్పుడైనా పెట్టుబడి దారులతో చర్చలు జరిపారా? ఒకవేళ చర్చలు జరిపినా ఆరు నెలల వ్యవధిలో పరిశ్రమ రాష్ట్రానికి తేవడం సాధ్యమవుతుందా ? అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు భూములు, రాయితీలు ఇస్తున్నాడని, ప్రజలు కట్టిన పన్నులని పరిశ్రమలకు కట్టబెడుతున్నాడని వాటికి వైసీపీ వ్యతిరేకమని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములు తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అనేక పరిశ్రమలని వెళ్లగొట్టారని విమర్శించారు.



    దశబ్దాల నుంచి ఉన్న అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమని కాలుష్యం వంకతో వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారని జీవీ రెడ్డి విమర్శించారు. వైసీపీ పాలనలో దాదాపు 98 పెద్ద పరిశ్రమలు, రూ.39వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని.. కానీ కేంద్రం అనేది ఒకటి ఉంటుందని, వాళ్లు ఎకనమిక్ సర్వే చేస్తారు, కేంద్రం కూడ డేటా విడుదల చేస్తుందని సీఎం మర్చిపోయి వచ్చినవి క్లెయిమ్ చేసుకుంటున్నారని వ్యగ్యంగా విమర్శించారు. టీడీపీ హయంలో 2 వేల నుంచి 3 వేల మిలియన్ల ఎఫ్.డీ.ఐలు వస్తే.. నేడు వైసీపీ హయాంలో వచ్చింది కేవలం 175 మిలియన్లు మాత్రమేనన్నారు. కర్ణాటకకు 18551 మిలియన్స్, తెలంగాణకు 1585 మిలియన్ల ఎఫ్.డి.ఐలు వస్తే రాష్ట్రానికి కేవలం 175 మిలియన్స్ వచ్చాయంటే వైసీపీ ప్రభుత్వ అసమర్థతకు అద్దంపడుతోందని విమర్శించారు
    Published by:Mahesh
    First published:

    Tags: AP Politics, Chandrababu Naidu, Ys jagan, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు