Chandrababu Naidu: చంద్రబాబుకు మరో షాక్.. పార్టీ పదవికి కీలక నేత రాజీనామా

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: ఎన్నికలను బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నెహ్రూ.. ఈ కారణంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    టీడీపీకి మరో కీలక నేత షాక్ ఇచ్చారు. టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలను బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నెహ్రూ.. ఈ కారణంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కేవలం జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గానే కొనసాగుతానని వెల్లడించారు. మరోవైపు బరిలో ఉన్న అభ్యర్థులు పోటీ చేయడంపై.. స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందని మరో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు.

    మరోవైపు ఏపీలో జరగనున్న పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని ఆ పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం వద్దని.. బరిలో ఉన్న నేతల అభిప్రాయం తీసుకోవాలని పోలిట్ బ్యూరో సమావేశంలో కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు బహిష్కరించడం వల్ల కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని నేతలు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టమని.. అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు నేతలకు తెలిపారు. ఎన్నికలను బహిష్కరించడం ద్వారా రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగడం లేదనే విషయాన్ని ప్రజలకు చెప్పే అవకాశం ఉందని ఆయన నేతలకు సూచించారు.

    అయితే ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్న స్థానిక టీడీపీ నేతలు ఈ విషయంలో భిన్నంగా ఆలోచిస్తున్నారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఒత్తిడి తమపై ఉందని.. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెబుతామని అంటున్నారు. మొత్తానికి పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం.. ఆ పార్టీలో ఎలాంటి ప్రకంపనలకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published: