2 నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు

విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖపట్టణం పర్యటన వాయిదాపడింది. దాంతో రోడ్డుమార్గంలోనే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లారు

news18-telugu
Updated: May 25, 2020, 2:45 PM IST
2 నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ, తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ దాటారు. మార్చి 22న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే ఉండిపోయారు. ప్రన్తుతం లాక్‌డౌన్ 4లో ఆంక్షలను సడలించడంతో తిరిగి ఏపీకి వచ్చారు. ఐతే విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు పరామర్శించాలని భావించారు. అందుకోసం నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో వెళ్లాలనుకున్నారు. కానీ, విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖపట్టణం పర్యటన వాయిదాపడింది. దాంతో రోడ్డుమార్గంలోనే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ వాహనాలకు వరకు అనుమతించారు. అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీ చేశారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు చంద్రబాబునాయుడు.



First published: May 25, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading