TDP LEADER BUDHA VENKKANNA ARREST BECAUSE OF COMMENTS ON MINSTER KODALI NANI AND DGP NGS
Gudivada Casino Issue: బుద్ధా వెంకన్న అరెస్ట్.. మంత్రి నాని, డీజీపీపై వ్యాఖ్యలతో కేసు
కొడాలి నానిపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
Budha venkkanna: గుడివాడ లోని క్యాషినో ఇష్యూ అరెస్టు పర్వాలకు దారి తీస్తోంది. మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ గా టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలతో.. అయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు..
Budha Venkkanna Arrest: గుడివాడ క్యాసినో (Gudivada Casina Issue) పై రేగిన రగడ మరింత దుమారం రేపింది. అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతల మద్య మొదలైన డైలాగ్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది. గుడివాడ వ్యవహారం విజయవాడ కు చేరింది. మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani), డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్ని ఆజ్యం పోశాయి. సోమవారం మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న మంత్రి కొడాలి నానితో పాటు డీజీపీని తీవ్రంగా విమర్శించారు. మంత్రి నిర్వహించిన క్యాసినోలో వాటాలు డీజీపీికి అందుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు, బెదిరింపుల వరకు వెళ్లారు. ఆయన అలా కామెంట్స్ చేశారో లేదో.. పోలీసులు వెంటనే స్పందించారు. బుద్ధా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ పోలీసులు విజయవాడ (Vijayawada) లోని ఆయన నివాసానికి వెళ్లారు. స్టేషన్ కు రావాలని కోరారు.. 41 ఏ నోటీసులు ఇవ్వకుండా విచారణకు ఎలా వస్తామని బుద్దా వెంకన్న అనుచరులు, టీడీపీ నేతలు నిలదీశారు.. దీంతో దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో వారందినీ అడ్డుకున్న పోలీసులు బుధ్దా వెంకన్నను అరెస్ట్ చేశారు..
ప్రస్తుతం బుద్దా వెంకన్నను తోటవల్లూరు పీఎస్ కు తరలించారు. అరెస్టు చేస్తున్న సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వైసీపీ నేతల ఫిర్యాదుతో బుద్దా వెంకన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట కేవలం ఈ వ్యాఖ్యలపై వివరణ అడిగేందుకు మాత్రమే ఆయన ఇంటికి వచ్చామని పోలీసులు చెప్పారు. తరువాత వివరణ ఇచ్చేందుకు స్టేషన్ కు రావాలని కోరారు.. దీంతో అనుమానం వచ్చిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. అసలు నోటీసులు ఇవ్వకుండా విచారణ ఏంటని నిలదీశారు.
ఏపీ వ్యాప్తంగా బుద్దా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. క్యాసినో ఎపిసోడ్‌లో డీజీపీకి కూడా వాటాలు అందాయని.. తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు విజయవాడలో బుద్దా వెంకన్న ఇంటికి వెళ్లారు. పోలీసులు వస్తున్నారని తెలియడంతో ముందుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. మరోవైపు క్యాసినో వివాదంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీని కలవాలని నిర్ణయించిన టీడీపీ నేతలు.. ఉదయం నుంచి ఆయన అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. బుద్దా వెంకన్న అరెస్టుతో ఏపీలో మరోసారి రాజకీయాలు మరింత వేడెక్కాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.