TDP LEADER BUDDHA VENKANNA WARNS MINISTER KODALI NANI OVER ABUSIVE COMMENTS ON CHANDRABABU AND NARA LOKESH FULL DETAILS HERE PRN
Budha Venkanna: కొడాలి నాని మనిషి కాదు మృగం.. మళ్లీ రెచ్చిపోయిన బుద్ధా వెంకన్న...
కొడాలి నానిపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
గుడివాడ క్యాసినో మంటలు (Gudivada Casino Issue) ఇంకా చల్లారడం లేదు. ఈ వ్యహారంలో వైసీపీ (YCP), టీడీపీ (TDP) నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.
గుడివాడ క్యాసినో మంటలు (Gudivada Casino Issue) ఇంకా చల్లారడం లేదు. ఈ వ్యహారంలో వైసీపీ (YCP), టీడీపీ (TDP) నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడ వెళ్లడంతో రేగిన వివాదం.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరింది. సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టై మళ్లీ విడుదలై బుద్ధా వెంకన్న.. మరోసారి రెచ్చిపోయారు. కొడాలి నానిపై ఘాటు విమర్శలు చేశారు. తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారాయన. 1990-91లోనే నెలక్షా 20 వేలు అద్దె చెల్లించి మరీ కొబ్బరికాయల వ్యాపారం చేసి పైకొచ్చానన్నారు. అదే కొడాలి నాని చరిత్ర.. ఆగి ఉన్న లారీలు, బస్సుల నుంచి టైర్లు, పెట్రోల్ దొంగించిలిన చరిత్ర నానీదని అన్నారు. చంద్రబాబు నాయుడు పెట్టిన బిక్షతో ఎమ్మెల్యే అయి ఇప్పుడు ఆయన మీదే అవాకులు చవాకులు పేలుతున్నాయన్నారు.
కొడాలి నానికి డబ్బు పిచ్చి, పదవి పిచ్చి పట్టిందన్నారు. మంత్రి పదవి పోతుందనే భయంతో పథకం ప్రకారమే చంద్రబాబు తిట్టి సీఎం జగన్ వద్ద మార్కులు కొట్టేయొచ్చన్నారు. చంద్రబాబు ఆదర్శవంతమైన వ్యక్తన్నారు. కొడాలి నాని మనిషి కాదు.. మృగం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి.. కొడాలి నానికి ఒకేసారి కరోనా వస్తే.. చంద్రబాబు మాత్రం ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారన్నారు. కొడాలి నానికి కరోనా వస్తే ఆస్పత్రిలో జాయిన్ అయ్యారన్ని ఎద్దేవా చేశారు. ఫేక్ ఫోటోలతో లోకేష్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తమపైకి పోలీసులను పంపించడమే కాకుండా.. బండ బూతులు తిట్టడమేంటని ప్రశ్నించారు.
కొడాలి నానికి మద పిచ్చి, డబ్బు పిచ్చి, పదవి పిచ్చి పట్టుకున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. ఒక కేబినెట్ మంత్రి ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే సీఎం జగన్ ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ ను బుద్ధా వెంకన్న ప్రస్తావించారు. కొడాలి నాని వంటి నేతలను ప్రజలు రెండున్నరేళ్లుగా భరిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. గుడివాడకు ఎవరెళ్లినా అడ్డుకుంటున్నారని.. అదేమైనా పాకిస్తాన్ లో ఉందా అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న.. మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. కొడాలి నాని.. చంద్రబాబు ఇంటి గేటును టచ్ చేస్తే ఆయన శవాన్ని పంపిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పోలీస్ కేసు నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.