ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గుడివాడ కాసినో వ్యవహారం (Gudivada Casino Issue) రేపిన మంటలు ఇంకా చల్లారలేదు. ఈ అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటలతూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గుడివాడ కాసినో వ్యవహారం (Gudivada Casino Issue) రేపిన మంటలు ఇంకా చల్లారలేదు. ఈ అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటలతూటాలు పేలుతున్నాయి. క్యాసినో వెనుక మంత్రి కొడాలి నాని హస్తముందని టీడీపీ ఆరోపిస్తుండగా.. వైసీపీ మాత్రం తమకేం సంబంధం లేదని కౌంటర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో నేతలు సంచలన విమర్శలు చేసుకుంటున్నారు. ఆదివారం టీడీపీ నేత వర్లరాెమయ్య ఫ్లైట్ నెంబర్లతో సహా సాక్ష్యాలు చూపిస్తే.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంతేస్థాయిలో మండిపడ్డారు. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న.. మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సీఎం జగన్ నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్ వరకు అందరికీ వార్నింగ్ ఇచ్చారు.
క్యాసినో వ్యవహారంలో కొడాలి నాని ఆత్మహత్య చేసుకోవడం కాదని.. జగన్ ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే ప్రజలే కొడాలి నాని చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కొడాలి నాని.. చంద్రబాబు ఇంటికి వస్తే గేటు దగ్గరే చంపేసి శవాన్ని తిరిగి పంపిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. గుడివాడ క్యాసినో వ్యవారంలో రూ.250 కోట్లు చేతులుమారాయన్నారు. ఆడు.. ఈడు అని మాట్లాడటానికి మేమేమైనా మీ బావమరుదులు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు హయాంలో చక్కగా పనిచేసిన సవాంగ్.. ఇప్పుడు మాత్రం జగన్ లాంటి వ్యక్తి డైరెక్షన్లో తప్పుమీద తప్పులు చేస్తున్నారన్నారు. డీజీపీ రిటైర్ అయిన తర్వాత కూడా వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. తనపై కేసులు పెట్టుకుంటారో.. ఆస్తులపై దాడులు చేయిస్తారో.. లేక చంపేస్తారో మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న.
చంద్రబాబు అంటే మర్యాద లేకుండా మాట్లాడితే కొడాలి నానిని చంపేస్తామని హెచ్చరించారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనను ఏం చేసుకుంటారో చేసుకోండని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. వర్లరామయ్య పొలీస్ గా ఉన్నప్పుడు కొడాలి నానిని లాకప్ లో వేసి కుమ్మారని సంచలన కామెంట్స్ చేశారు బుద్ధా వెంకన్న. గతంలో చంద్రబాబు ఇంటికి జోగి రమేష్ వెళ్తే.. బుద్ధి చెప్పి పంపామన్నారు. కొడాలి నానికి దమ్ముంటే చంద్రబాబు ఇంటికి రావాలని.. అక్కడ తేల్చుకుందామని సవాల్ విసిరారు.
టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా కూడా కొడాలి నానిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి పిచ్చిపట్టిందని.. ఆయన్ను డాక్టర్ కు చూపించాల్సిన అవసరముందన్నారు. అంతేకాదు మనిషి కనిపిస్తే కొరికేసేలా ఉన్నారని.. రాత్రిపూట వస్తే చేతబడులు చేసేవాడిలా ఉంటారంటూ ఎద్దేవా చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.