Home /News /andhra-pradesh /

TDP LEADER BONDA UMA SLAMS YS JAGAN OVER NEW DISTRICTS ISSUE FULL DETAILS HERE PRN

AP New Districts: కృష్ణాజిల్లా విభజనపై ముదిరిన వార్.. సీఎం జగన్ కు బొండా ఉమా వార్నింగ్..

వైఎస్ జగన్, బొండా ఉమా (ఫైల్)

వైఎస్ జగన్, బొండా ఉమా (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాల (AP New District) ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాలకు చెప్పేందుకు నెలరోజుల గడువు కూడా ఇచ్చింది. ఐతే జిల్లాల సరిహద్దులు, జిల్లా కేంద్రాలు, పేర్లపై తొలి నుంచి వివాదం నెలకొంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాలకు చెప్పేందుకు నెలరోజుల గడువు కూడా ఇచ్చింది. ఐతే జిల్లాల సరిహద్దులు, జిల్లా కేంద్రాలు, పేర్లపై తొలి నుంచి వివాదం నెలకొంది. ప్రజాసంఘాలు, స్థానికులతో పాటు రాజకీయ పార్టీలు కూడా జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పేర్లు, కేంద్రాలపై కొన్నిచోట్ల నిరసన దీక్షలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లా విభజన కూడా తీవ్ర వివాదాస్పదమవుతోంది. విజయవాడ పక్కనే ఉన్న ప్రాంతాలను మచిలీపట్నంలో కలపడమే కాకుండా.. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం కూడా వివాదానికి కారణమైంది. విజయవాడకు ఎన్టీఆర్ పేరుకు బదులు వంగవీటి రంగా పెరు పెట్టాలని ఆయన మిత్రులు, కాపునేతలు డిమాండ్ చేస్తున్నారు.

    తాజాగా విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టి.. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు రాధారంగ మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, బాల, కాపు సంఘం నేత బత్తిర రాము సంఘీభావం ప్రకటించారు. తూర్పు కృష్ణాకు యన్టీఆర్‌ జిల్లాగా, పశ్చిమ కృష్ణాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని దీక్షలో బొండా ఉమా డిమాండ్ చేశారు.

    ఇది చదవండి: చింతామణికి రామాయణానికి లింక్.. రఘురామ ఎంట్రీతో వాడివేడి వాదనలు..


    అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా అని ప్రశ్నించిన ఉమా.., కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటి చెప్పాలన్నారు. జిల్లాల వల్ల కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందాని.. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. కొత్త జిల్లాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన లు జరుగుతున్నాయని.. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి మచిలీపట్నం జిల్లా కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని.., పేదల సమస్యలపై పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వంగవీటి రంగా పేరు విజయవాడ జిల్లాకు పెట్టాలని బొండా ఉమాతో పాటు పలువురు నేతలు డిమాండ్ చేశారు.

    ఇది చదవండి: విజయసాయికి చెక్ పెట్టేందుకు ఆ వైసీపీ నేత స్కెచ్..? ఎంపీ పదవి రాకుండా అడ్డుకుంటున్నారా..?


    రంగా అభిమానులను కించ పరిచే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని.., అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉదృతం చేస్తామని బొండా ఉమా ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకుంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యవహారంపై రాజంపేట, మదనపల్లె తదితర ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే..!
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP new districts, Bonda uma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు