భూమా అఖిలప్రియపై టీడీపీ నేత సంచలన ఆరోపణలు

తన హత్యకు జరిగిన కుట్రలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ ప్రధాన నిందితులు అని సుబ్బారెడ్డి ఆరోపించారు.

news18-telugu
Updated: June 4, 2020, 5:08 PM IST
భూమా అఖిలప్రియపై టీడీపీ నేత సంచలన ఆరోపణలు
భూమా అఖిలప్రియ (ఫైల్ ఫొటో)
  • Share this:
టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిలప్రియపై ఆ పార్టీకి చెందిన మరో నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.అఖిలప్రియ దుర్మార్గురాలు అని... ఫ్యాక్షన్‌కు తెరలేపిందని ఆయన మండిపడ్డారు. తన హత్యకు జరిగిన కుట్రలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ ప్రధాన నిందితులు అని సుబ్బారెడ్డి ఆరోపించారు. వారిద్దరు తనను చప్పేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. వారి అనుచరులు రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజోరెడ్డితో చేతులు కలిపి తనను హతమార్చాలని చూస్తున్నారని అన్నారు. అంతే కాకుండా తనను చంప్పేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని వ్యాఖ్యానించారు.

భూమా అఖిలప్రియ, భార్గవ్‌లను తక్షణం అరెస్ట్ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. జైలు జీవితం గడిపితే మరోసారి ఇలాంటి తప్పు చేయరని ఆయన అన్నారు. తనను తాను కాపాడుకోగలనని... తనకేమీ భయంలేదని అన్నారు. వాళ్లకు చేతనైంది తనకు చేతకాదా ? అని అన్నారు. తనకు కూడా అనుచరులు ఉన్నారని అన్నారు. కేసు విచారణ జరుపుతున్న పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. కొద్ది నెలల క్రితం టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నానికి కొందరు కుట్ర చేశారు. అయితే కడప పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి కుట్రను భగ్నం చేశారు.

First published: June 4, 2020, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading