Home /News /andhra-pradesh /

ఏపీ ఈఎస్ఐ స్కాం.. అచ్చెన్నాయుడు ఏం చెప్పారంటే..

ఏపీ ఈఎస్ఐ స్కాం.. అచ్చెన్నాయుడు ఏం చెప్పారంటే..

అచ్చెన్నాయుడు (ఫైల్ ఫోటో)

అచ్చెన్నాయుడు (ఫైల్ ఫోటో)

టెలీ హెల్త్ సర్వీసులకు అర్డర్స్ ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే తాము కూడా వ్యవహరించామని అచ్చెన్నాయుడు గతంలో వివరణ ఇచ్చారు.

    ఏపీ ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయన అవినీతికి పాల్పడినట్టు విచారణలో తేలిందని ఏసీబీ స్పష్టం చేసింది. అయితే గతంలో ఈ స్కాం వెలుగులోకి వచ్చిన సమయంలోనే అచ్చెన్నాయుడు దీనిపై స్పందించారు. అప్పట్లో ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించిన విధంగానే తాము వ్యవహరించామని అన్నారు. టెలీ హెల్త్ సర్వీసులకు అర్డర్స్ ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే తాము కూడా వ్యవహరించామని అచ్చెన్నాయుడు తెలిపారు. తాను మంత్రిగా ఇచ్చిన లేఖలోనూ ఇదే విషయం ఉందని ఆయన గుర్తు చేశారు. తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని ఆయన వ్యాఖ్యానించారు. తనకు డబ్బులు అవసరమైతే తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటానని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

    ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని అన్నారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు ఏపీ ఈఎస్ఐలో చోటు చేసుకున్న భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని... నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని రిపోర్ట్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Esi scam, Kinjarapu Atchannaidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు