పవన్ కల్యాణ్‌ ఢిల్లీ టూర్‌పై టీడీపీ ఆసక్తికర కామెంట్స్..

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశమై.. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను వివరిస్తారని తెలుస్తోంది.

news18-telugu
Updated: November 15, 2019, 9:36 PM IST
పవన్ కల్యాణ్‌ ఢిల్లీ టూర్‌పై టీడీపీ ఆసక్తికర కామెంట్స్..
పవన్ కల్యాణ్ ఫైల్ ఫోటో
  • Share this:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన.. బీజేపీ పెద్దల్ని కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చిస్తారని సమాచారం. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశమై.. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను వివరిస్తారని తెలుస్తోంది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ స్పందించింది. ఆయన ఢిల్లీ వెళ్లిన పరిణామాలకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఐతే ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ, జనసేన కలిసి కట్టుగా ఆందోళనలు చేస్తున్నాయి. విశాఖలో పవన్ కల్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు టీడీపీ నుంచి అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు హాజరై మద్దతు తెలిపారు. ఇక గురువారం విజయవాడలో చంద్రబాబు చేపట్టిన ఇసుక దీక్షకు జనసేన సైతం మద్దతు తెలిపింది. ఆ పార్టీ తరపున జనసేన ఎమ్మెల్యే
రాపాక వరప్రసాద్ హాజరయిన విషయం తెలిసిందే.First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com