చంద్రబాబుకి బూస్ట్ ఇస్తున్న సబ్బం హరి... టీడీపీ గెలుపుపై ఆయన విశ్లేషణ ఏంటంటే...

AP Assembly Elections Exit Polls 2019 : ఏపీ ఎన్నికలు ముగియగానే... సబ్బం హరి ఏం చెప్పారో... ఇప్పటికీ అదే మాటపై ఉన్నారు. కచ్చితంగా టీడీపీదే గెలుపు అంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 18, 2019, 11:27 AM IST
చంద్రబాబుకి బూస్ట్ ఇస్తున్న సబ్బం హరి... టీడీపీ గెలుపుపై ఆయన విశ్లేషణ ఏంటంటే...
చంద్రబాబు, సబ్బం హరి
  • Share this:
Exit Polls 2019 : ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాగానే... తనదైన విశ్లేషణలతో అందరి దృష్టినీ ఆకర్షించేవారు సబ్బం హరి. ఆయన చెప్పిన విశ్లేషణలు, సర్వేల ఫలితాలు కూడా వాస్తవాలకు దగ్గరగానే ఉండేవి. ఐతే... లాగడపాటి రాజగోపాల్ లాగానే... తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సబ్బం హరి కూడా రాంగ్ విశ్లేషణే చేశారు. దాంతో ఆయన కూడా ఫేడవుడ్ అయ్యారు. ఐతే... ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక... రెండ్రుజుల తర్వాత ఏప్రిల్ 13న... టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్లేషించారు. ఆ సమయంలో... ఏపీ వ్యాప్తంగా టీడీపీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం బాగా జరిగింది. దాదాపు వారం పాటూ అది సాగింది. ఆ తర్వాత మాత్రం సీన్ వైసీపీ వైపుకి మళ్లింది. వైసీపీ గెలుస్తుందనే సర్వేలు ఎక్కువయ్యాయి.

దాదాపు 40 రోజులైపోతున్నాయి. ఇప్పుడు వైసీపీయే అధికారంలోకి వస్తుందని చెప్పే సర్వేలు ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందువల్ల సబ్బం హరి తన విశ్లేషణను మార్చుకుంటారని కొందరు భావించారు. కానీ సబ్బం హరి... అప్పుడూ, ఇప్పుడూ అదే మాటపై ఉన్నారనీ, కచ్చితంగా టీడీపీయే గెలుస్తుందని చెప్పినట్లు తెలిసింది. ఇటీవల ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేబినెట్ సమావేశం నిర్వహించినప్పుడు, అధికారులతో సమావేశమైనప్పుడూ... టీడీపీ కచ్చితంగా గెలుస్తుందని చంద్రబాబు చెప్పడం వెనక... సబ్బం హరి ఇచ్చిన భరోసా ఉందని తెలుస్తోంది. ఎలాంటి అనుమానాలూ వద్దన్న సబ్బం హరి... మే 23న వచ్చే ఫలితాలను మాత్రమే నమ్మాలనీ... ఎగ్జిట్ పోల్స్, ఇతరత్రా ఏవీ పట్టించుకోవద్దని చెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది.

మహిళలే డిసైడింగ్ ఫ్యాక్టర్ ? : టీడీపీ భీమిలీ అభ్యర్థి అయిన సబ్బం హరి... ఈసారి మహిళలే టీడీపీని గెలిపించబోతున్నారని విశ్లేషించారు. ఒకప్పుడు పార్టీతో సంబంధం లేకుండా ఉన్న సబ్బం హరి... ఇప్పుడు టీడీపీ నేత కాబట్టి... ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే, పార్టీతో సంబంధం లేకుండా... వాస్తవాలకు దగ్గరగా తన విశ్లేషణ ఉంటుందని ఆయన చెబుతున్నారు. ప్రధానంగా ఎన్నికలు జరిగే ముందు చివరి రెండు వారాల్లో ప్రభుత్వం ఇచ్చిన పసుపు-కుంకుమ నిధులు, వృద్ధాప్య పెన్షన్లూ టీడీపీని గెలిపించబోతున్నాయని ఆయన ఎనలైజ్ చేశారు. వైసీపీ కూడా ఇలాంటి పథకాలు (నవరత్నాలు) తెస్తామని హామీ ఇచ్చినా... ఆల్రెడీ టీడీపీ అమలు చేస్తోంది కాబట్టి... మహిళలు వైసీపీవైపు చూడలేదన్నది ఆయన విశ్లేషణగా తెలిసింది.

సబ్బం హరి... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో దాదాపు ఫ్రెండులా ఉండేవారు. ఐతే... జగన్‌తో సఖ్యతగా లేరు. 2014 ఎన్నికలప్పుడే జగన్‌ను వ్యతిరేకించారు. పైగా ఇప్పుడు టీడీపీ నేత కాబట్టి... ఆయన సర్వేనూ, విశ్లేషణలనూ నమ్మాల్సిన పనిలేదంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీ నేతలు మాత్రం... సబ్బం హరి లాంటి వారు తమకు బూస్ట్ ఇస్తున్నారని అంటున్నారు. నిజంగానే ఆయన చెప్పినట్లు టీడీపీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీ విజయం వెనక మహిళా ఓట్లు ఉన్నాయని భావించవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా కాకుండా టీడీపీ ఓడిపోతే, అప్పుడు కూడా మహిళల ఓట్లు వైసీపీకి చేరడం వల్లే ఓడిపోయినట్లవుతుందని విశ్లేషిస్తున్నారు.ఇవి కూడా చదవండి :

లగడపాటి సర్వే సిద్ధం... ఎగ్జిట్‌ పోల్స్ ఏం చెప్పినా...

Bigg Boss 13 : బిగ్ బాస్ 13లో పసుపు చీర పోలింగ్ అధికారి..?బిడ్డకు జన్మనిచ్చిన యువతి... తను గర్భవతి అనే తెలియదట...

ఎవరు గెలుస్తారు..? కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు...
Published by: Krishna Kumar N
First published: May 18, 2019, 11:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading