హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ బిల్లు మళ్లీ సెలెక్ట్ కమిటీకే.. మండలి చైర్మన్‌కు టీడీపీ నోటీసు

ఆ బిల్లు మళ్లీ సెలెక్ట్ కమిటీకే.. మండలి చైర్మన్‌కు టీడీపీ నోటీసు

ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ (ఫైల్)

ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ (ఫైల్)

ఈ బిల్లులు గతంలోనే సెలెక్ట్ కమిటీ ముందున్నాయని తాము ఇచ్చిన టీడీపీ నోటీసులో పేర్కొంది.

    శాసనమండలిలో సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను చర్చించడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద నోటీసిచ్చింది. ఈ బిల్లులు గతంలోనే సెలెక్ట్ కమిటీ ముందున్నాయని తాము ఇచ్చిన టీడీపీ నోటీసులో పేర్కొంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినా సెక్రటరీ దానికి అనుగుణంగా వ్యవహరించలేదని ప్రస్తావించింది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం మండలి ఛైర్మనుకు ఉందని నోటీసులో వెల్లడించింది. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకే పంపాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నోటీసులో స్పష్టం చేశారు. అంతకుముందు సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్టు సభ్యులకు చైర్మన్‌ షరీఫ్‌ తెలిపారు. బడ్జెట్‌పై చర్చ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామని వెల్లడించారు. ప్రస్తుతం శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. ఆ తరువాత సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో చర్చ జరుగుతుందా ? జరిగితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap legislative council, Crda

    ఉత్తమ కథలు