రాజధానిపై టీడీపీ న్యాయపోరాటం... అమరావతి రైతులతో దేవినేని కీలక వ్యాఖ్యలు...

వైసీపీ ప్రభుత్వం... దసరా నాటికి విశాఖ నుంచి పాలన సాగించేందుకు రెడీ అవుతోంది. మరి టీడీపీ పోరాటాలు ఫలించే అవకాశం ఉందా?

news18-telugu
Updated: August 2, 2020, 2:03 PM IST
రాజధానిపై టీడీపీ న్యాయపోరాటం... అమరావతి రైతులతో దేవినేని కీలక వ్యాఖ్యలు...
రాజధానిపై టీడీపీ న్యాయపోరాటం... అమరావతి రైతులతో దేవినేని కీలక వ్యాఖ్యలు...
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో... అధికార వైసీపీ... ఈ నెల 23 లోపే... కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని, ప్రారంభోత్సవాల వంటివి పూర్తి చెయ్యాలనుకుంటోంది. ఎందుకంటే... శ్రావణమాసం తరవాత భాద్రపద మాసం వస్తుంది. ఆ మాసంలో ఏ కార్యక్రమాలూ తలపెట్టరు. కాబట్టి... ప్రభుత్వం ఈ విషయంలో జోరందుకుంది. అటు ప్రతిపక్ష టీడీపీకి... అమరావతినే పాలనా రాజధానిగా ఉంచే విషయంలో అస్త్రాలేవీ ఫలించకపోవడంతో... న్యాయ పోరాటం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న కొన్ని చిక్కుముళ్ల లాంటి అంశాల్ని తెరపైకి తేబోతున్నట్లు తెలిసింది.

తాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవి నేని ఉమ... అమరావతి ప్రాంతంలోని వెలగపూడి, తుళ్లూరులో రైతులు, మహిళలు చేస్తున్న ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ఎన్నికల ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని అన్న జగన్... అధికారంలోకి వచ్చాక మాట మార్చి, ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతగా జగన్ అప్పుడు అమరావతికి మద్దతు పలికి ఇప్పుడు ఎందుకిలా మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యం, రాజ్యాంగం గొప్పదన్న ఉమ.... ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. అమరావతి రైతులు, మహిళలది ధర్మపోరాటం, న్యాయపోరాట మన్న ఉమ... న్యాయస్థానాల్లో రైతులు విజయం సాధించడం ఖాయమన్నారు. కరోనా సమయంలో కూడా రైతులు... ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని మెచ్చుకున్న ఉమ... 70 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా రాలేదని మండిపడ్డారు. రాజధాని సమస్య 29 గ్రామాల సమస్య కాదనీ.. ఐదు కోట్ల మంది ప్రజలది అని ఉమ అన్నారు.

వైసీపీ మాత్రం దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఆల్రెడీ... వివిధ శాఖలకు సంబంధించిన భవనాలు, అధికారులు, ఉద్యోగులకు సంబంధించి తాత్కాలిక భవనాల్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ ప్రక్రియంతా ఎప్పుడో జరిగిపోవడంతో... ఇక పాలన అక్కడి నుంచి సాగించడమే ఆలస్యమన్న వాదన వైసీపీ వర్గాల నుంచి వస్తోంది. అమరావతిని నీరుగార్చలేదనీ... అన్ని ప్రాంతాలనీ అభివృద్ధి చేసి చూపిస్తామని... మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీన్ని బట్టీ... వైసీపీ వేగంగా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading