Shocking comments: మళ్లీ జగనే సీఎం.. టీడీపీ ఫైర్ బ్రాండ్ షాకింగ్ కామెంట్స్.. పార్టీ పరిస్థితిపై ఆవేదన

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

వైసీపీ నేతలు అంటే అంతెత్తున లేస్తారు.. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తే.. ఘాటుగా కౌంటర్లు ఇస్తారు.. అసలు చంద్రబాబుపై ఈగ వాలినా ఒప్పుకోరు.. మంత్రుల వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్లు ఇస్తారు.. అలాంటి టీడీపీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ జగనే సీఎం అవుతారంటూ వ్యాఖ్యానించారు.. ఇంతకీ ఆ మాటలకు అర్థం ఏంటి..?

 • Share this:
  చంద్రబాబుపై చెప్పలేనంత అభిమానం.. ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేరు. క్షణాల్లోనే వారికి వార్నింగ్ ఇస్తారు. ఇక వైసీపీ మంత్రులు చంద్రబాబును ఏదైనా అంటే.. తొలి కౌంటర్ ఇచ్చేది కూడా ఆమె.. సీఎం జగన్ నుంచి ఎందరో మంత్రులపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఇంకెవరో కాదు టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి.. నిన్నటి వరకు వైసీపీ తీరుపై విరుచుకుపడే ఆమె.. సడెన్ గా వాయిస్ మార్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభంజనం ఖాయమే అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రాచారంపై ఆమె స్పందించారు. వైసీపీ నాయకులు తనని ఎప్పటి నుంచో పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని.. వైసీపీ వాళ్లతో ఆరోగ్యవంతమైన స్నేహ బంధాలు ఉన్నాయన్నారు. అక్కడితోనే ఆగని ఆమె టీడీపీ తనను సరిగా వాడుకోలేదంటున్నారు. ప్రస్తుతం టీడీపీ బావుంటే కొనసాగుతా.. పార్టీ బాలేకపోతే బయటకు వెళ్లిపోతా అనే స్వభావం తనది కాదంటూ చెప్పిన ఆమె మాత్రం వైసీపీ నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. తానే వైసీపీ పార్టీ వాళ్ల దగ్గరకు వెళ్లి పార్టీలో చేరతానని అడుగుతున్నానని కొందరు అటున్నారని.. కానీ నూటికి నూరు శాతం కావచ్చు. పర్సనల్‌గా వాళ్లు నాకేం శత్రువులు కాదన్నారు. రాజకీయంగా వాళ్లు పోటీ అంతే. ఆరోగ్యవంతమైన స్నేహ బంధాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన చాలామందితో తనకు ఉన్నాయన్నారు.

  ప్రస్తుతం టీడీపీ పరిస్థితి బాగాలేదనే వాదనతో తాను ఏకీభవిస్తాను అన్నారు. ఆ విషయం ఎవరో చెప్తేనే కాదు.. తనకు కూడా తెలుసన్నారు. కానీ ఒక అధినేత దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాం కాబట్టి.. పార్టీకి కట్టుబడి ఉంటున్నా అన్నారు. అప్పట్లో సాధినేని యామిని పార్టీ మారినప్పుడే.. తనకు చాలా కాల్స్ వచ్చాయన్నారు. అయితే తాను టీడీపీలో జాయిన్ అయినా వెంటనే.. వైసీపీ పార్టీ నుంచి చాలా కాల్స్ వచ్చాయని.. అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ మనదే దివ్యా.. నువ్ ఈ పార్టీలోకి వచ్చెయ్ అని అన్నారని.. కానీ తన స్వభావం అది కాదన్నారు. మా నాయకుడు పరిస్థితి బాగాలేదని.. ఇబ్బందుల్లో మునిగిపోయాడని వేరే పార్టీలోకి వెళ్లిపోదాం అని నేను అనుకోను అన్నారు.

  ఇదీ చదవండి: ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఫిక్స్.. రాకుంటే రాజకీయ సన్యాసమే

  నాయకుడిగా చంద్రబాబు గారి విజన్.. ఆయన క్రమశిక్షణ తనకు ఇష్టమన్నారు. కొన్ని సరిచేసుకునే అవకాశాలు తీసుకుంటారేమో అని వెయిట్ చేస్తున్నా.. అలానే టీడీపీలో తన టాలెంట్‌ను సరిగా ఉపయోగించుకోవడం లేదన్నారు. అధికార ప్రతినిధి అనే పోస్ట్ ఒకటి ఇచ్చారు కానీ.. ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా అవకాశం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని తాను కూడా విన్నాన్నారు. ఎందుకు అంటే జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్లకి డబ్బు వెదజల్లుతున్నారని గుర్తు చేశారు. వీటి ద్వారా బావి తరాల వారికి ఫ్యూచర్ లేకుండా చేసేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అదే చంద్రబాబు ఉండి ఉంటే.. ఏపీ ప్రజలు ధీమాగా ఉంటారన్నారు. . ఈ రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి లేదు కానీ.. రౌడీఇజం ఎక్కువగా ఉందన్నారు. అన్యాయం అని ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారు. సొంత పార్టీవాళ్లని కూడా వదలడం లేదని మండిపడ్డారు. తమ ప్రాణాలను ఆస్తులను కాపాడుకోవడం కోసం వైసీపీ పార్టీలోకి జంప్ అవుతున్నారని. తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలు విన్న టీడీపీ నేతలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ ఆమె వైసీపీని తిట్టారా.. చంద్రబాబును తిట్టారా.. ఆమె మాటలకు అర్థాలు ఏంటి అని చర్చించుకుంటున్నారు..

  ఇదీ చదవండి: చంద్రబాబుకు జూనియర్ సెగ.. కాబోయే సీఎం అంటున్న ఫ్యాన్స్.. తెరపైకి పవన్ ఇష్యూ
  Published by:Nagesh Paina
  First published: