మహిళలు వైసీపీకి ఓటు వేశారా... పోలింగ్ డే నాడు చంద్రబాబు వ్యూహం ఫెయిలైందా...

AP Assembly Election 2019 : ఏ పార్టీ ఎన్ని వ్యూహాలు రచించినా... పోలింగ్ డే నాడు ఓట్లు తమకు పడినప్పుడే ఆ వ్యూహాల ఫలితం దక్కుతుంది. మరి టీడీపీ వ్యూహం బెడిసికొట్టిందా

Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 8:46 AM IST
మహిళలు వైసీపీకి ఓటు వేశారా... పోలింగ్ డే నాడు చంద్రబాబు వ్యూహం ఫెయిలైందా...
ఓటు వేసేందుకు వచ్చిన మహిళలు (File)
  • Share this:
డ్వాక్రా రుణాలు, పసుపు-కుంకుమ, పిల్లల్ని బడికి పంపితే ఏడాదికి రూ.18,000, వితంతు పెన్షన్, పెళ్లి ఖర్చులకు రూ.1,00,000 ఇలాంటి హామీలతో మహిళల ఓట్లను ఆకట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద కసరత్తే చేశారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నుంచీ మహిళలకు మేలు చేసే పథకాల్ని వన్ బై వన్ ప్రకటించి... కొన్నింటిని అమల్లోకి తెచ్చారు. మరికొన్ని తిరిగి అధికారంలోకి వచ్చాక అమల్లోకి తెస్తామన్నారు. ఎప్పుడూ లేనిది ఈసారి చంద్రబాబు కాస్తా... చంద్రన్నగా మారిపోయారు. నాకు కోటి మంది అక్కచెల్లెళ్లు ఉన్నారంటూ... మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్నెన్ని రకాల ప్రయత్నాలు చెయ్యొచ్చో అన్నీ చేశారు. సరిగ్గా ఎన్నికలు జరిగే ఏప్రిల్ 11కి నాల్రోజుల ముందు... పసుపు-కుంకుమ మూడో విడత నిధులను విడుదల చేసి... వాటిని ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని ప్రచారంలో దుమ్మురేపారు. ఇంతా చేసిన టీడీపీ వర్గాలు... ఇక మహిళల ఓట్లన్నీ తమకే పడతాయని బలమైన అంచనాకి వచ్చాయి.

పోలింగ్ రోజున ఏం జరిగిందంటే : టీడీపీ అంతర్గత అంచనా ప్రకారం... పోలింగ్ రోజున ఉదయం వేళ మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. వాళ్లలో చాలా మంది టీడీపీకి అనుకూలంగా ఓటు వేయబోయారు. ఇంతలో ఈవీఎంలు మొరాయించాయి. చిరాకొచ్చి చాలా మంది మహిళలు మళ్లీ వద్దాంలే అని అనుకొని వెళ్లిపోయారని టీడీపీ వర్గాలు భావించినట్లు తెలిసింది.

మధ్యాహ్నం వేళ ఓటు వేసేందుకు మళ్లీ మహిళలు వద్దామనుకునేలోపు... వైసీపీ వర్గాలు... ఆందోళనలకు దిగాయనీ... లేనిపోయి ఉద్రిక్త పరిస్థితులు తేవడంతో... భయపడిన మహిళలు ఓటు వేసేందుకు రాలేదనీ... తద్వారా మధ్యాహ్నం వేళ తమకు పడాల్సిన ఓట్లు పడకుండా పోయాయని టీడీపీ వర్గాలు అంచనా వేసినట్లు తెలిసింది.

సాయంత్రం వేళ అదే మహిళలు ఓటు వేసేందుకు వచ్చారు. ఇక టీడీపీకి ఓట్లు పడిపోతాయని ఆ పార్టీ వర్గాలు భావించాయి. అంతలో... క్యూలైన్లు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ ప్రజలు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల దగ్గర ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ టైంలో ఎన్నికల అధికారులు కనీస సదుపాయాలు కల్పించడంలో ఫెయిలయ్యారు. కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి. క్యూలోంచీ బయటకు వెళ్లి నీళ్లు తాగి వద్దామంటే... అప్పటికే పోలింగ్ టైమ్ (సాయంత్రం 6 గంటలు) ముగియడంతో... అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దాంతో... ప్రజలకు మళ్లీ కోపం వచ్చింది. ఎన్నికల ముందు వరకూ అది చేస్తాం, ఇది చేస్తాం అన్న టీడీపీ ప్రభుత్వం పోలింగ్ డే రోజున ఏ ఏర్పాట్లూ చెయ్యకుండా... తమను ఇబ్బంది పెడుతోందని మహిళలు భావించారనీ, టీడీపీ ప్రభుత్వంపై అప్పటికప్పుడు వచ్చిన కోపంతో... వైసీపీకి ఓటు వేశారని టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.నిజానికి ఎన్నికల రోజున ఏర్పాట్లు చెయ్యాల్సింది ప్రభుత్వం కానే కాదు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఏర్పాట్ల సంగతి చూసుకోవాలి. కానీ ఈసీ ఏర్పాట్లపై దృష్టి సారించకపోవడం వల్ల... అప్పటికప్పుడు జరిగిన అసత్య ప్రచారంతో... ప్రజలు తప్పంతా ప్రభుత్వానిదేనని భావించి... వైసీపీకి మొగ్గు చూపారని చంద్రబాబు అండ్ కో భావిస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా తమకు పడతాయనుకున్న ఓట్లు కాస్తా వైసీపీకి పడిపోయాయనీ... అనుకున్నదొక్కటైతే... జరిగింది మరొకటి అని టీడీపీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలిసింది.

 

ఇవి కూడా చదవండి :30 కోట్ల మంది కస్టమర్లు... దూసుకెళ్తున్న రిలయన్స్ జియో...

నేడు ప్రపంచ కప్ భారత జట్టు ప్రకటన... ఛాన్స్ కొట్టేసేదెవరు...

ఆ నల్ల ట్రంకు పెట్టెలో ఏముంది... నరేంద్ర మోదీపై కర్ణాటక ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్....

నేడు సీఈసీ ముందుకు టీడీపీ టెక్నికల్ టీం... EVMల ట్యాంపరింగ్ నిరూపిస్తారా...
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు