హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

గుంటూరు జిల్లాలో టీడీపీ నేత పురంశెట్టి హత్య, ఎస్ఐపై ఆరోపణలు

గుంటూరు జిల్లాలో టీడీపీ నేత పురంశెట్టి హత్య, ఎస్ఐపై ఆరోపణలు

హత్యకు గురైన పురంశెట్టి అంకుల్ (FIle)

హత్యకు గురైన పురంశెట్టి అంకుల్ (FIle)

గుంటూరు జిల్లా దాచేపల్లిలో దారుణం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లో తెలుగుదేశం పార్టీ నేతను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో దారుణం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లో తెలుగుదేశం పార్టీ నేతను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకుల్ ను కొందరు దుండగులు హత్య చేశారు. పెదగార్లపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచిగా పదిహేను సంవత్సరాలు పని చేశారు పురంశెట్టి అంకుల్. కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న అపార్ట్‌మెంట్‌లో గొంతుకోసి హత్య చేశారు. వైసీపీ నేతలే ఆయన్ను చంపారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఘటన స్థలానికి వచ్చి పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. అలాగే, ఈ ఘటన వెనుక దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి ప్రమేయం కూడా ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలనాగిరెడ్డి సపోర్టుతోనే వైసీపీ నేతలు ఈ హత్యకు ఒడిగట్టారని పురంశెట్టి అంకులు కుటుంబసభ్యులు, బంధువులు, టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఓ టీడీపీ నేత హత్యకు గురయ్యాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సుబ్బయ్య అనే టీడీపీ నాయకుడిని కొందరు వెంటాడి చంపారు. సోములవారిపల్లె పొలాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్‌ఆర్‌ జగనన్నకాలనీలో ఈ హత్య జరిగింది. ప్రత్యర్థులు నందం సుబ్బయ్య కళ్లల్లో కారం కొట్టి వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. అయితే ఈ టీడీపీ నేత హత్య పై వివాదం రాజుకుంటుంది. సుబ్బయ్య హత్యతో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి సంబంధం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే లు. రాచమల్లును కలసిన వారిలో డిప్యూటి సీఎం అంజాద్ భాష, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే ను పరామర్శించి.. కేసు పై ఆయనతో చర్చించారు.


సుబ్బయ్య హత్యకేసులో రాచమల్లు పేరు పెట్టేంతవరకు తాము ఆయనకు అంత్యక్రియలు నిర్వహించబోమంటూ టీడీపీ నేత నారా లోకేష్, సుబ్బయ్య కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన తర్వాత పోలీసులు వారికినచ్చజెప్పి ఎమ్మెల్యే పేరు చేరుస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చౌడేశ్వరి ఆలయం వద్ద ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు. సుబ్బయ్యపై 14 కేసులు ఉన్నాయని.. ఈ మధ్య దొంగ సారా కేసులోనూ పట్టుబడ్డాడని ఎమ్మెల్యే తెలిపారు. నేర చరిత్ర ఉన్న సుబ్బయ్యకు ఎంతో మంది శత్రువులు ఉంటారని.. వారిలో ఎవరో చంపి ఉంటారని శివప్రసాద్ అభిప్రాయపడ్డారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur, Tdp

ఉత్తమ కథలు