వచ్చే నెలలో టీడీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం...

వచ్చే నెల రాయపాటి సాంబశివరావు ఆస్తులు వేలం వేసేందుకు ఆంధ్రా బ్యాంక్ సిద్ధమవుతోంది.

news18-telugu
Updated: February 21, 2020, 6:43 PM IST
వచ్చే నెలలో టీడీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం...
రాయపాటి సాంబశివరావు (file)
  • Share this:
సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కష్టాలు కొనసాగుతున్నాయి. రాయపాటికి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్‌ గురువారం పత్రికా ప్రకటన జారీచేసింది. ఈ నేపథ్యంలో రూ.837.37 కోట్ల విలువైన రుణం బకాయి పడటంతో గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు సంబంధించిన ఆస్తులను మార్చి 23న వేలం వేస్తున్నట్లు పేర్కొంది. గుంటూరు అరండల్‌పేటలోని 22,500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న వాణిజ్య భవనంతో పాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్‌ను వేలం వేస్తున్నట్టు ప్రకటనలో తెలిపింది. గుంటూరు భవనం ఆస్తి విలువను రూ.16.44 కోట్లుగాను, ఢిల్లీలోని ఫ్లాట్‌ విలువను రూ.1.09 కోట్లుగా బ్యాంక్ నిర్ధారించింది.

ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియాతో పాటు, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి పేరిట తీసుకున్నారు. ఈ రుణానికి గ్యారంటెర్లుగా రాయపాటి జగదీష్‌, రాయపాటి జీవన్, నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్‌ వాణి, జగన్‌మోహన్‌ యలమంచలి ఉన్నారు. మిగిలిన వివరాల కోసం ఆంధ్రాబ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా టెండర్స్‌ డాట్‌ గవ్‌ డాట్‌ ఇన్‌ను సంప్రదించాల్సిందిగా బ్యాంక్ ప్రకటనలో పేర్కొంది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత రాయపాటి సాంబశివరావు టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే తనకు ఇప్పటికప్పుడు బీజేపీలో చేరే ఆలోచన లేదని... భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని రాయపాటి కొద్దిరోజుల క్రితం ప్రకటించారు.


First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు