జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

JC Prabhakar Reddy: సీఐ దేవేందర్‌ను దూషించిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: August 7, 2020, 6:31 PM IST
జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
జేసీ ప్రభాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
54 రోజుల పాటు కడప జైలులో ఉండి నిన్న బెయిల్‌పై విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సహా మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. సీఐ దేవేందర్‌ను దూషించిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో కేసు కూడా నమోదు చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయనను గుత్తి కోర్టులో హాజరు పరుచనున్నారు.

నిన్న కడప జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి.. అక్కడ నుంచి భారీ కారు ర్యాలీతో బయలుదేరారు. అయితే ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ స‌మ‌యంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆఫీసర్ తాడిపత్రి సీఐ దేవేంద‌ర్ పట్ల జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించారు. ఈ ర్యాలీ హెవీ వాహానాలకు మాత్రమే అనుమతి ఉన్న లైన్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్న సీఐ దేవేందర్ ఆ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కాన్వాయ్ దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సీఐ దేవేందర్‌తో దురుసగా వ్యవహరించారు. నా కారును ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు.

ఈ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సైతం కొద్దిసేపు హంగామా సృష్టించారు. ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణ చేసిన తరువాత అనంత‌పురం పోలీసులు జేసీపై పలు సెక్షన్ల కితం కేసులు నమోదు చేశారు. ఐపీసీ 353 తోపాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసీటి కేసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై న‌మోదు చేశారు పోలీసులు. జైలు నుంచి విడుద‌లైన 24 గంట‌లు తిర‌గ‌క ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరిన్ని కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: August 7, 2020, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading