TDP CHIEF NARA CHANDRA BABU NAIUD MADE SENSATIONAL COMMENTS ON YS VIVEKANANDA REDDY MURDER CASE FULL DETAILS HERE PRN
CBN Comments: వైఎస్ వివేకా హత్య కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఆ అధికారి బదిలీపై అనుమానం..
చంద్రబాబు నాయుడు (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) పై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) పై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో నిందితులను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఓ అధికారి బదిలీ ఇందుకు ఊతమిస్తోందన్నారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కడప జైలులో ప్రాణహాని ఉందని ఆయన అన్నారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొద్దు శీనును అనంతపురం జైలులో హత్య చేసినప్పుడు జైలర్ గా వరణ్ రెడ్డి ఉన్నారని.. ఇప్పుడు ఆయన్నే కడప జైలుకు బదిలీ చేశారరని.. దీన్నిబట్టి చూస్తే వివేకా హత్య కేసులో నిందితులను కూడా చంపేందుకు కుట్ర జరుగుతోందని అనుమానాలు వస్తున్నాయన్నారు.
కడప జైలర్ గా వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తానని చంద్రబాబు తెలిపారు. మొద్దు శీను హత్య తర్వాత వరుణ్ రెడ్డిని సస్పెండ్ చేస్తే.. ఆ తర్వాత ఆయన కనిపించలేదని.. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుణ్ రెడ్డిపై ఉన్న అన్ని సస్పెన్షన్లు ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. జైలులో ఉండాల్సిన వ్యక్తికి తీసుకొచ్చి ఇష్టమొచ్చినట్లు చేస్తారా అని ప్రశ్నించారు. పరిటాల రవి కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కర్ని చంపుకుంటూ వచ్చారని.. వివేకా హత్య కేసులోనూ అదే జరగొచ్చని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. సీఎం జగన్, అవినాష్ రెడ్డి కలిసి వరుణ్ రెడ్డి సాయంతో నిందితులను హత్య చేయించే అవకాశముందన్నారు.
వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమపై కేసులు పెట్టిన పోలీసులను కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. అక్రమ కేసులపై డీజీపీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో సమస్యలే వారే సృష్టించి.. పరిష్కరించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
ఇక ఎమ్మెల్సీ అశోక్ బాబు విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అశోక్ బాబు సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నా కావాలనే కేసులు బనాయించారని విమర్శించారు. అర్ధరాత్రి వచ్చి భయభ్రాంతులకు గురిచేసి అరెస్ట్ చేశారన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు, కార్యక్రతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇకపై అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికొచ్చి పోరాడతామని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.