టీడీపీలో చంద్రగ్రహణం... ఇంట్లోంచీ బయటకు రాని చంద్రబాబు... మహానాడు వాయిదా....

చంద్రబాబు

AP TDP : కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో ఉన్న టీడీపీ... కౌంటింగ్ రోజున వైసీపీ ఎక్కడ అల్లర్లు సృష్టిస్తుందోనని ఆందోళన చెందారు. తీరా ఫలితాలు వచ్చాక, వాటిని జీర్ణించుకోలేకపోతున్నారు.

  • Share this:
Andhra Pradesh : ఫలితాల ముందు వరకూ దేశమంతా తిరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఇప్పుడసలు ఇల్లు దాటి బయటకు రావట్లేదు. అమరావతి పక్కనే ఉన్న ఉండవల్లిలోని తన ఇంట్లోనే ఉంటున్నారు. ఎప్పట్లాగే ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలూ... ఆయన ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఎందుకు ఓడిపోయిందీ, ఎక్కడ తేడా వచ్చిందీ ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు. ఐతే, మిగతా జిల్లాల కంటే... నెల్లూరులో ఓటమిని చంద్రబాబు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. అక్కడ పేదల కోసం కొన్ని వేల ఇళ్లు నిర్మించినా, ఏమాత్రం అనుకూల ఫలితాలు రాకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన చెందినట్లు సమాచారం. ఇళ్లు నిర్మించినా, వాటిని పేదలకు ఇవ్వకపోవడం దెబ్బేసిందని ఆ జిల్లా నేత సోమిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసినా, సామాజిక సమీకరణలు, జనసేన ప్రభావంతో టీడీపీకి పడాల్సిన ఓట్లు చీలిపోయాయని విశ్లేషించారట నేతలు.

29న సమీక్షా సమావేశం : ఏపీ ఎన్నికల తర్వాత ఐదు సర్వేలు, పోలింగ్‌పై సమీక్షలు జరిపిన చంద్రబాబు... ఇప్పుడు ఓటమికి గల కారణాలు తెలుసుకునేందుకు సమీక్షలు జరపాలని డిసైడయ్యారు. అందులో భాగంగా... 29న ఉండవల్లిలోని తన ఇంట్లోనే... ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. అంతకుముందు అంటే 28న పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి నాడు గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించబోతున్నారు.

మహానాడు వాయిదా : ఎన్నికల్లో గెలిచి అట్టహాసంగా మహానాడు జరుపుకోవాలని ఆశించిన చంద్రబాబుకి తీవ్ర నిరాశ కలిగింది. అది ఎంతలా అంటే, అసలు మహానాడే జరపకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. జనరల్‌గా మే 27, 28, 29న మహానాడు జరుగుతుంది. మే 23న ఫలితాల కారణంగా... మహానాడుకు ఏర్పాట్లు చెయ్యలేదనీ, అందువల్ల వాయిదా వేస్తున్నామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే, ఘోర ఓటమి కారణంగా... ఈసారి మహానాడు జరపకపోవడం బెటరన్న వాదన పార్టీ వర్గాల నుంచీ వినిపిస్తున్నట్లు టాక్.

 

ఇవి కూడా చదవండి :

నేడు తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల... ఇలా తెలుసుకోండి...

గతాన్ని తవ్వుతారా... భవిష్యత్తును రచిస్తారా... జగన్ గురి ఎటు?
First published: