Home /News /andhra-pradesh /

TDP CHIEF CHANDRABABU NAIDU WILL ATTEND TO FACE ENQUIRY IN AP WOMEN COMMISSION OFFICE NGS

AP Politcs: మహిళ కమిషన్ ముందు చంద్రబాబు హాజరవుతారా..? అసలు కేసు ఏంటంటే..?

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

AP Politics: టీడీపీ అధినేత చంద్రబాబు.. మరో కీలక నేత బొండా ఉమలు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశాలు అందాయి. మరి దీనిపై చంద్రబాబు ఇతర టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు..?

    Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) విచారణకు హాజరు కావాల్సిందే అని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర నేత బొండా ఉమ (Bonda Uma) కు కూడా రాష్ర్ట మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. కారణం ఏంటంటే..? విజయవాడ (Vijayawada) ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma ) ను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం.. అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు రావాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టంగా సమన్లలో పేర్కొన్నారు.

    మహిళ కమిషన్ అయితే సమన్లు జారీ చేసింది. మరి దీనిపై టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మహిళ కమిషన్ పిలిచినంత మాత్రాన తమ అధినేత వెళ్లేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే.. దొంగే దొంగ అని అరిచినట్టు ఉందన్నారు. ఎందుకంటే అసలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ అత్యాచార ఘటన జరిగిందని.. బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని.. ప్రభుత్వం తమ బాధ్యతలు విస్మరిస్తే.. ప్రతిపక్ష పార్టీగా మేం ప్రశ్నిస్తే.. విచారణకు రమ్మని పిలవడం ఏంటని నిలదీస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉంటే.. ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టాలా అని చూడకుండా.. నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఇదీ చదవండి : వైసీపీ–కాంగ్రెస్ జతకట్టేనా? జగన్ మనసులో ఏముంది? పొత్తు, పదవులపై విజయసాయి క్లారిటీ

    టీడీపీ నేతల వెర్షన్ ప్రకారం.. మహిళ కమిషన్ విచారణకు ఎట్టి పరిస్థితిలో హాజరు అయ్యేది లేదంటున్నారు టీడీపీ నేతలు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తి పెంచుతోంది. దీంతో ఈ నెల 27వ తేదీన ఏం జరుగుతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ వీషయం ఏంటంటే..? విజయవాడ ఆసుపత్రి దగ్గర శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. అత్యాచార బాధితురాలికి నేతల పరామర్శలతో హైటెన్షన్‌గా మారింది. టీడీపీ, వైసీపీ నేతలు ఎదురుపడటంతో వాగ్వాదం జరిగింది. ఇక మంత్రులు పరామర్శించారు. మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్, రజినీ పరామర్శించారు. బాధితురాలికి అండగా ఉంటామన్నారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు హోం మంత్రి తానేటి వనిత.

    ఇదీ చదవండి : ఆయన పార్టీ మారుతున్నారా..? నారా లోకేష్‌తో భేటీపై ఏమన్నారంటే?

    అయితే అంతుకుముందు ఆసుపత్రిలో చంద్రబాబు బాధితురాలిని పరామర్శించారు. పరామర్శించిన సమయంలో ఒకేసారి ఎదురుపడ్డారు చంద్రబాబు, మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. ఆ సమయంలో టీడీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకోబోయారు. అయితే దానికి ఆమె స్పందిస్తూ.. బాధితురాలితో మాట్లాడాలి.. ఘటనను రాజకీయం చేయొద్దని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. దీంతో వాగ్వాదం జరిగింది. వెంటనే స్పందించిన చంద్రబాబు.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌తో అన్నారు. ఊరికే వచ్చి పరామర్శించి వెళ్లిపోతే కుదరదన్నారు. అయితే తనను అడ్డుకోవడంతో పాటు, బాధితురాలి మాటలు తనకు అర్థం కాకుండా చేసినందుకు గాను.. విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bonda uma, Chandrababu Naidu, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు