Chandra babu flood tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ఇటీవల వానలు ముంచెత్తాయి.. అయితే వరద భయం (AP Floods)ఇంకా వీడలేదు. రాయలసీమలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి (Tirupati) సమీపంలోని రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను పూడ్చడం ఆలస్యం అవ్వడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వం తీరుకు నిరసన తెలుపుతూ.. వెంటనే పూడ్చి, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) డిమాండ్ చేస్తున్నారు. ఆయన స్వయంగా రాయల చెరువును పరిశీలించారు. చెరువు కట్టకు చేస్తున్న మరమ్మతులను దగ్గరుండి పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదినక పనులు పూర్తి చేయాలని కోరారు. మరమ్మతులు వేగవంతం చేయకుంటే.. ప్రమాదం జరిగే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాయల చెరువు దగ్గర ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చెరువు దగ్గర సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి… చంద్రబాబు కనిపించగానే లేచి నిల్చుని నమస్కారం చేశారు. చెవిరెడ్డి నమస్కారానికి చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారా లేదాన్న అన్నది అక్కడ క్లియర్ గా కనిపించలేదు..
ఇదీ చదవండి : 5G కన్నా ముందే వస్తున్న 6G.. ప్రత్యేకత ఏంటి..? ఇండియాకు ఎప్పుడు వస్తుంది..?
ప్రస్తుతం ఏపీలో నడుస్తోన్న పొలిటికల్ హీట్ నేపథ్యంలో ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురించేసింది. సాధారణంగానే చెవిరెడ్డికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అని ముద్ర ఉండేది. జగన్ కు వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. అందులోనూ చంద్రబాబు అంటే అంతెత్తున లేచి విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల ఎందుకో చెవిరెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయన వ్యక్తిత్వానికి భిన్నంగా సౌమ్యంగా కనిపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు-వైసీపీ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇలాంటి సమయంలొ చెవిరెడ్డి అలా నిలబడి నమస్కారం చేయడం ఆసక్తికరంగా మారింది..
YCP MLA NAMASTHE TO CHANDRA BABU || రాయల చెరువు దగ్గర ట్విస్ట్.. చంద్రబా... https://t.co/mfOsNmdPhW via @YouTube #YSRCP #YCP #TDPWithFloodVictims #TDPWillBeBack @SandhyaSamayam
— nagesh Journlist (@nageshzee) November 24, 2021
ఆ సంగతి ఎలా ఉన్నా.. స్థానికులకు భయ భ్రాంతులకు గురి చేస్తున్న రాయల చెరువును పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తొలుత పర్మిషన్ లేదన్నారు పోలీసులు. రాయలచెరువును రెడ్ జోన్‌గా గుర్తించినట్లు వివరించారు. చెరువుకు గండి పడడంతో మరమ్మతులు పనులు జరుగుతున్నాయని.. చంద్రబాబు కాన్వాయ్ వచ్చేందుకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఆయనకు భద్రత కల్పించలేమంటూ చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు నానికి నోటీస్ ఇచ్చారు స్థానిక DSP. దీంతో.. అక్కడ పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. అయినప్పటికీ చంద్రబాబు అక్కడికి చేరుకుని రాయలచెరువును పరిశీలించారు.
ఇదీ చదవండి: స్కూల్ టీచర్ పాడు పని.. 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో లింక్.. ఆ వెంటనే డిలీట్
మరోవైపు ఈ పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తిరుపలిలోని వరద ప్రభావానికి గురైన గాయత్రి నగర్లో పరిశీలిస్తుండగా చంద్రబాబుకు తన బాల్య మిత్రుడు తారసపడ్డాడు. అనుకోకుండా బాల్యమిత్రుడు శ్రీనివాస నాయుడు కనిపించడంతో సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. అతనితో కాసేపు ముచ్చటించారు. బాల్యమిత్రుడు శ్రీనివాస నాయుడు ఇంటికి వెళ్లి.. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు చంద్రబాబు.
ఇదీ చదవండి : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లైఫ్ లో ట్విస్ట్ లు.. మిస్ ఇండియా కాలేక పోయారు కానీ..
తరువాత తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాలను చంద్రబాబు కాలినడకన పరిశీలించారు. వరద ప్రాంతాల పరిశీలన తరువాత వైకుంఠపురం దగ్గర చంద్రబాబు ప్రసంగించారు. ఇసుక వ్యాపారుల కోసమే అన్నమయ్య ప్రాజెక్ట్ లో నీరు నిల్వ చేశారని ఆరోపించారు. అధిక నీటి నిల్వతో ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందన్నారు. ఫలితంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారని బాధను వ్యక్తం చేశారు. తుమ్మలగుంట చెరువులో ఉండాల్సిన నీరు ఎమ్మార్ పల్లికి వచ్చి కొంపలు ముంచాయన్నారు. ఇన్నేళ్లుగా రాని నీరు ఇపుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు చూస్తే బాధేస్తోందన్నారు. వైసీపీది చెత్త ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదే కలెక్టర్లు, పోలీసులు, ఇంజనీర్లు తన హాయంలో సమర్థంగా పని చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు విఫలం కావడానికి కారణం.. యధారాజ తథ ప్రజా అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Floods, AP News, AP Politics, Chandrababu Naidu, Chevireddy bhaskar reddy