నేడు కుప్పంకి చంద్రబాబు... టీడీపీ వైసీపీ ఫ్లెక్సీ వార్‌తో ఉద్రిక్త పరిస్థితులు...

Chandrababu Kuppam Tour : తన సొంత నియోజకవర్గంలో వైసీపీ దూకుడు పెరుగుతుండటం చంద్రబాబుకి తలనొప్పిగా మారుతోందా? ఈ రెండ్రోజులూ అక్కడ ఏం జరగబోతోంది?

news18-telugu
Updated: February 24, 2020, 6:25 AM IST
నేడు కుప్పంకి చంద్రబాబు... టీడీపీ వైసీపీ ఫ్లెక్సీ వార్‌తో ఉద్రిక్త పరిస్థితులు...
చంద్రబాబు (File - Credit - twitter - Rafi)
  • Share this:
Chandrababu Kuppam Tour : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు అనుకున్నారు. అందుకోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేద్దామనుకున్నారు. అక్కడ రగడ మొదలైంది. ఎందుకంటే... కుప్పం పట్టణం మొత్తం ఎక్కడ చూసినా వైసీపీ ఫ్లెక్లీలే ఉన్నాయి. కారణం వారం కిందట మంత్రి పెద్దిరెడ్డి అక్కడ పర్యటించారు. ఆయన్ని స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పర్యటన ముగిసినా అధికారులు వాటిని తొలగించాలని ఆదేశించలేదు. మాజీ సీఎం పర్యటన ఉందనీ, తాము ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలనీ, అందువల్ల ఆల్రెడీ ఉన్నవాటిని తొలగించాలని వైసీపీ నేతలు ముందే కోరినా... ఏమాత్రం తొలగించలేదు. తొలగిస్తామని మాట ఇచ్చిన అధికారులు ఆ విషయమే మర్చిపోయారు. త్వరలో కుప్పంలో వైసీపీ ఎంపీ రెడ్డప్ప పర్యటన ఉంటుందనీ, అందువల్ల ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకునేది లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే రగడకు కారణమైంది. టీడీపీ అంటే అంత చులకన అయిపోయిందా అంటూ... ఆ పార్టీ నేతలు... కమిషనర్ లక్ష్మిని కలిసి... ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆమె కూడా చర్యలు తీసుకోకపోవడంతో... టీడీపీ భగ్గుమంటోంది. ఇవాళ్టి పర్యటనలో ఏం జరుగుతుందో, ఫ్లెక్సీల రగడ ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

ఆదివారం కుప్పం మండలం వెండుగంపల్లిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, వైసీపీ నేతలు ఏయ్... ఏయ్ అటూ కలబడ్డారు. ఇవాళ వెండుగంపల్లిలో టీడీపీ జెండాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. ఆ ఛాన్స్ ఇచ్చేది లేదనీ... టీడీపీ జెండా దిమ్మెను తొలగిస్తామని వైసీపీ నేతలు తెలిపారు. ఇలా అక్కడ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంది.

ఇంతకీ చంద్రబాబు కుప్పంలో ఎందుకు పర్యటించబోతున్నారన్నది చర్చించుకోవాల్సిన అంశం. కుప్పం మండలం... వెండుగంపల్లిలో ఈమధ్య చనిపోయిన పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చబోతున్నారు చంద్రబాబు. ఆ క్రమంలో ఓ ప్రైవేటు స్థలంలో హేమంత్‌ విగ్రహం ఏర్పాటు కోసం దిమ్మెను నిర్మించారు. దానికి కొద్దిదూరంలో రోడ్డు పక్కనే టీడీపీ జెండాని ఏర్పాటు చేశారు. ఇదే వివాదానికి తెరతీసింది. వైసీపీ కార్యకర్తలు... టీడీపీ జెండాను ఎగరవెయ్యనివ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు జెండా ఎగరవేస్తే... తర్వాత తాము తొలగిస్తామని వైసీపీ నేతలు తెలిపారు. అందువల్ల ఏం జరుగుతుందో అన్నది టెన్షన్ కలిగిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: February 24, 2020, 6:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading