ఉండవల్లికి గాలం వేస్తున్న టీడీపీ... వైసీపీ వదులుతుందా... ?

AP Assembly Election 2019 : ఓటమి భయంతో ఉన్నవారికి... ఆ భయమే క్షణక్షణం వెంటాడుతూ ఉంటుంది. కానీ గెలుపు ధీమాలో ఉన్న చంద్రబాబు... రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరి ఉండవల్లి ఏం చేస్తారు. టీడీపీలో చేరతారా?

Krishna Kumar N | news18-telugu
Updated: May 10, 2019, 10:36 AM IST
ఉండవల్లికి గాలం వేస్తున్న టీడీపీ... వైసీపీ వదులుతుందా... ?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (ఫైల్ ఫొటో)
  • Share this:
దివంగత సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో క్రియాశీల రాజకీయాల్లో ఉన్న నేతల్లో ఒకరు ప్రస్తుత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన... అప్పుడప్పుడూ టీడీపీపై విమర్శలు చేస్తూ... ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అత్యంత చురుగ్గా కనిపిస్తున్నారు. ప్రధానంగా ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కారణం ఆయన వైసీపీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీలో చేరతారనీ, కీలక పదవి (అసెంబ్లీ వ్యవహారాల మంత్రి) చేపడతారని ప్రచారం జరుగుతోంది. జగన్‌పై ఉన్న కేసులు కోర్టుల్లో చెల్లవని అప్పుడప్పుడూ చెబుతున్న ఉండవల్లి... వైసీపీలో చేరేందుకు పాజిటివ్‌గానే ఉన్నారని తెలుస్తోంది.

స్వతహాగా లాయరైన ఉండవల్లి, ఏ విషయాన్నైనా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పే వైఖరి ఉన్న ఆయన... వైసీపీలో చేరితే తమకు ఇబ్బందే అన్న సంకేతాలు టీడీపీ వర్గాల నుంచీ వస్తుండటంతో... ఆయన్ను తమ పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నదానిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ కూడా సేఫ్ ఫార్ములా వర్తిస్తోంది. స్వతహాగా లాయరైన ఉండవల్లి టీడీపీలో చేరితే, అది వైసీపీకి రాజకీయంగా పెద్ద దెబ్బే అవుతుందని టీడీపీలోని కొందరు నేతలు అధినేతకు చెబుతున్నారట. ఫలితాలు రావడానికి ఇంకో రెండు వారాలు ఉండటంతో... ఈలోగా ఉండవల్లితో టచ్‌లో ఉంటూ... మెల్లిగా ఆయన్ను టీడీపీ గూటికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.

సడెన్‌గా ఉండవల్లి ఎందుకు? : ఉండవల్లి అరుణ్ కుమార్‌పై టీడీపీలో పాజిటివ్ వేవ్స్ రావడానికి ప్రధాన కారణం ఇటీవల ఆయన చేసిన ఓ కామెంటే. టీడీపీకి పది ఎంపీ స్థానాలు వస్తే, కేంద్రంలో ప్రధాన మంత్రి పదవి చంద్రబాబు దక్కించుకునే అవకాశాలున్నాయని ఉండవల్లి అన్నారు. అంతేకాదు... ఇప్పుడున్న పరిస్థితుల్లో మమతా బెనర్జీ కంటే... అన్ని పార్టీలనూ కలుపుకుపోయే విషయంలో చంద్రబాబే ముందు ఉన్నారని అన్నారు. తద్వారా ఆయన టీడీపీకి అనుకూలంగా మాట్లాడినట్లైంది. ఇదే ఆ పార్టీలోని కొందరి చూపు ఉండవల్లి వైపు పడేలా చేస్తోంది.

ఉండవల్లి మనసులో ఏముంది? : ఇటు వైసీపీ, అటు టీడీపీ ఈ రెండు పార్టీల్లోనూ దేనిలోనూ చేరే విషయంలో ఉండవల్లి నుంచీ ఇప్పటివరకూ స్పష్టమైన సంకేతాలేవీ రాలేదు. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నట్లే నిర్మాణం జరిగితే... మరో పదేళ్లైనా పోలవరం పూర్తికాదని ఉండవల్లి ఇదివరకు చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ఆ వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడింది. అలాంటిది ఇప్పుడు అదే పార్టీలోకి ఆయన వెళ్తారా అంటే డౌటే.

వైసీపీలోకి వెళ్లే విషయంలో మాత్రం పాజిటివ్ సంకేతాలున్నాయి. ప్రధానంగా ఒకప్పుడు వైఎస్ హయాంలో దాదాపు మిత్రుడిలా ఉండేవారు ఉండవల్లి. జగన్‌తో ఆయనకు శత్రుత్వం ఏదీ లేదు. అందువల్ల ఈ రాజమండ్రి నేత వైసీపీలో చేరినా ఆశ్చర్యం అక్కర్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా జరగాలంటే వైసీపీ అధికారంలోకి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఇవి కూడా చదవండి :

దొనకొండపై వైసీపీ నేతల దృష్టి... జోరుగా భూముల కొనుగోళ్లు...

ఐపీఎల్ బెట్టింగ్ వివాదం... భార్యను చంపిన భర్త... యాసిడ్ తాగించి...

ప్రధాని అభ్యర్థిగా శరద్ పవార్... తెరపైకి కొత్త సమీకరణలు...

23న ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం... లెక్క త్వరగా తేలదంటున్న అధికారులు...
Published by: Krishna Kumar N
First published: May 10, 2019, 10:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading