హోమ్ /వార్తలు /andhra-pradesh /

Chandrababu Covid Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Chandrababu Covid Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

కొవిడ్ విలయం నేపథ్యంలో గడిచిన రెండేళ్లుగా అసాధారణ జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోన్న ఆయన తొలిసారి వైరస్ బారిన పడ్డారు. కొడుకు నారా లోకేశ్ కు కరోనా సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే చంద్రబాబుకూ ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయింది.

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరోనా కాటుకు గురయ్యారు. కొవిడ్ విలయం నేపథ్యంలో గడిచిన రెండేళ్లుగా అసాధారణ జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోన్న ఆయన తొలిసారి వైరస్ బారిన పడ్డారు. కొడుకు నారా లోకేశ్ కు కరోనా సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే చంద్రబాబుకూ ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిన విషయాన్ని టీడీపీ అధినేత స్వయంగా మంగళవారం ఉదయం ప్రకటించారు. చంద్రబాబుకు కరోనా సోకిందన్న వార్త పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపగా, తన ఆరోగ్య పరిస్థితిపైనా బాబు వివరణ ఇచ్చారు..

  తాజా టెస్టుల్లో తనకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్న చంద్రబాబు.. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. ఇన్పెక్షన్ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే (హోం) ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని చెప్పిన చంద్రబాబు.. ఇటీవల కాలంలో తనను కలిసి ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, ఏ మాత్రం అనుమానం ఉన్నా ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.

  Covid చికిత్సలో కేంద్రం సంచలనం: మళ్లీ రెమ్‌డెసివీర్‌కు చోటు.. తీవ్రతను బట్టి వాడాల్సిన మందులివే

  తొలుత నారా లోకేశ్, ఇప్పుడు చంద్రబాబు కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ కావడంతో మంగళవారం టీడీపీ నిర్వహించే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు నారా కుటుంబం దూరంకానుంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలకు పార్టీ పిలుపునివ్వడం తెలిసిందే.

  First published:

  ఉత్తమ కథలు