హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: టీడీపీలో చేరాలి అనుకునేవారికి షాక్.. వలపక్షులకు చోటు లేదన్న చంద్రబాబు

Chandrababu: టీడీపీలో చేరాలి అనుకునేవారికి షాక్.. వలపక్షులకు చోటు లేదన్న చంద్రబాబు

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu hot comments: ఎన్నికల ముందు పార్టీలు మారే నేతలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వలస పక్షులకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం కుదరదని తేల్చేశారు. ఎవరైతే పార్టీ కోసం కష్ట పడతారో వారికి మాత్రమే పదవులు ఇస్తానని క్లారిటీ ఇచ్చారు..

ఇంకా చదవండి ...

Chandrababu naidu hot comments: టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) ను పోసాని మీరు మారిపోయార్ సార్ అన్నట్టు.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ని తెలుగు తమ్ముళ్లు మీరు మారిపోయారు సార్ అంటున్నారు.  ఈ మార్పు ఫుల్ టైమా లేక, టెంపరరీనా అని చూడాలి.. కానీ తాజాగా ఆయన వ్యాఖ్యలు చూస్తే నిజంగానే మారియారా అని ఆలోచనలో పడ్డారు.  వరుస పరాభవాలు.. ఎన్నికల్లో ఓటమలతో ప్రస్తుతం చంద్రబాబు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.  అయితే అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట. ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్. మార్పు అన్నది భవిష్యత్తులో తేలనుంది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్లు మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి.  ముఖ్యంగా వచ్చే ఎన్నికల సమయానికి టీడీపీలో చేరుదామని అనుకున్నవారికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి..

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జమ్మలమడుగు నేతలు పచ్చ కండువా కప్పుకున్నారు. టీడీపీలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్‍రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి తదితరులు చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..  పార్టీలో ఎవరు పని చేస్తున్నారో లేదో అన్ని లెక్కలు రాసుకుంటున్నాను అన్నారు. పార్టీ కోసం పని చేయని వారిని ఉపేక్షించేది లేదన్నారు. అలాగే పార్టీలు మారి వచ్చే వారికి అసలు ప్రాధాన్యమిచ్చేది లేదని స్పష్టం చేశారు. వలస పక్షులకు ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వను అని వెల్లడించారు. తెలుగుదేశం కోసం ఎవరైతే కష్టపడతారో  గుర్తించి వారికి మాత్రమే తిగిన ప్రాధాన్యం ఇస్తాను అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు కూడా పనితనం ఆధారంగా కేటాయిస్తామన్నారు. అంతేకాను ఎన్నికల్లో పోటీకోసం పక్క పార్టీలో సీటు దక్కలేదని.. టీడీపీలోకి వచ్చే వారికి అవకాశం ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు..

ఇదీ చదవండి : ఎక్కడకు వెళ్లారు..? ఏం మాట్లాడారు..? చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం.. అందుకే అక్కడికి వెళ్లలేదన్న సీఎం జగన్

తాజా వ్యాఖ్యలే కాదు.. ఇటీవల చాలా వరకు చంద్రబాబు తీరులో మార్పు వచ్చింది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.. అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే కరువయ్యేది. అలాంటిది తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్‌-ఇన్‌ కార్యక్రమాలు చేపడుతున్నారంట.. అంతేకాదు ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో ఉండే సామాన్య కార్యకర్తలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే.. రోజుకు ఇద్దరు ముగ్గురితో స్వయంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటుటన్నారు.

ఇదీ చదవండి : మా వల్లే సినిమాలకు కలెక్షన్లు... జూనియర్ ఎన్టీఆర్ ది సేఫ్ గేమ్.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఇలా అధినేతలో వచ్చిన మార్పు చాలా మంచిదే అంటున్నారు. ఈ మార్పు తాత్కాలికం కాకుండా.. శాశ్వతంగా ఉంటుందా..? అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అలాగే ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఆయన ఎంత వరకు నిలబెట్టుకుంటారో చూడాలి.. ఇప్పుడు ఇలా మాట్లాడినా.. ఎన్నికల సమయానికి అంతా నార్మల్.. అని పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తారంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu

ఉత్తమ కథలు