కేంద్రంలో మళ్లీ NDA ప్రభుత్వం వస్తుందా... చంద్రబాబు టెన్షన్ పడుతున్నారా... తాజా లెక్కలేంటి...

Lok Sabha Election 2019 : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినా... ఇప్పటికీ అక్కడి రాజకీయాలు హాట్ గా ఉండటానికి చంద్రబాబు కారణం అవుతున్నారా....

Krishna Kumar N | news18-telugu
Updated: April 22, 2019, 6:27 PM IST
కేంద్రంలో మళ్లీ NDA ప్రభుత్వం వస్తుందా... చంద్రబాబు టెన్షన్ పడుతున్నారా... తాజా లెక్కలేంటి...
చంద్రబాబు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పది రోజులు దాటినా... ఫలితాలు రావడానికి మరో నెల టైం ఉన్నా... ఆ రాష్ట్రంలో రాజకీయాల వేడి ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ అధినేత జగన్ ఎన్నికలు ముగిసిన తర్వాత... జాతీయ రాజకీయాల జోలికి వెళ్లట్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రెండు, మూడో దశల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు దక్షిణాది రాష్ట్రాల్ని చుట్టేశారు. కర్ణాటకలో మిత్రపక్షం జేడీఎస్, తమిళనాడులో మిత్రపక్షం DMK తరపున ఎన్నికల ప్రచారం సాగించారు. మూడో దశలోనూ అదే జోరు కొనసాగించారు. మిగతా నాలుగు దశల్లో కూడా చంద్రబాబు ఇదే విధంగా దేశమంతా తిరిగి ఆయా రాష్ట్రాల్లోని మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం సాగిస్తారని తెలిసింది.

NDA రాకూడదనే ఉద్దేశమా : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో మళ్లీ NDA ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అది తమకు ఏమాత్రం కలిసిరాదనీ, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి మరిన్ని కష్టాలు తెస్తారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే, అప్పుడు కేంద్రంలో NDA ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అప్పుడు టీడీపీ నేతలకు మరిన్ని కష్టాలు తప్పవని చంద్రబాబు లెక్కలేసుకున్నట్లు తెలిసింది.

ఏపీలో అధికారంలోకి వచ్చినా రాకపోయినా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తమకు చాలా వరకూ కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తే, ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, అది తమకు స్వర్ణయుగంగా భావిస్తున్న చంద్రబాబు... ఒకవేళ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకపోయినా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతూ... రాష్ట్రంలో టీడీపీకీ, ఆ పార్టీ నేతలకూ ఎలాంటి నష్టమూ కలగకుండా జాగ్రత్త పడొచ్చని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది.


ఇవన్నీ ఆలోచించిన చంద్రబాబు... ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ NDA ప్రభుత్వం రాకూడదన్న కృతనిశ్చయంతో దేశవ్యాప్త పర్యటనలకూ, ప్రచారాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాదనీ, కానీ మిత్రపక్షాలతో కలిసి మళ్లీ NDA ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీడీపీ అంతర్గత సర్వేలో తేలినట్లు సమాచారం. ఐతే... గట్టిగా ప్రయత్నిస్తే, బీజేపీని జాతీయ స్థాయిలో దెబ్బకొట్టడం పెద్ద కష్టమేమీ కాదనీ, ఆల్రెడీ ఉత్తరాది రాష్ట్రాల్లో (హిందీ బెల్ట్) బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఏలాగూ బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు లేవని భావిస్తున్న చంద్రబాబు... ప్రతీ రాష్ట్రంలోనూ జరిగే, ప్రతీ విడత ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీ టార్గెట్‌గా బలమైన వ్యతిరేక ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకోవడం వల్లే, ఆయన నిరంతరం పర్యటనలు సాగిస్తున్నారని తెలిసింది.

 

ఇవి కూడా చదవండి :

వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు

వారానికి మూడు యాపిల్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

First published: April 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading